ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం విచిత్రమైన జీవోలు జారీ చేస్తోంది. అధికారులను వేధింపులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తోంది. గ్రామ సర్పంచ్, కార్యదర్శుల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.2ను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాజ్యాంగబద్దంగా సర్పంచులు, కార్యదర్శులకు ఉన్న అధికారాలను వీఆర్వోలకు అప్పగించడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.
గుంటూరు జిల్లా తోకలవారిపాలం సర్పంచ్ తమ అధికారాలు లాగేసుకుంటున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జీవోను సస్పెండ్ చేసింది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనా సంస్కరణలు పెద్ద ఎత్తున మార్పులు చేపట్టింది. గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసింది.
గ్రామపంచాయతీ కార్యాలయాలు, సర్పంచుల వ్యవస్థ పని చేస్తున్నప్పటికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసింది. వీరి అధికారాలను వీఆర్వోలకు బదిలీ చేస్తూ ఈ ఏడాది మార్చి 25న జీవో 2ను జారీ చేసింది. దీంతో సర్పంచ్ కంటే వీఆర్వోకే ఎక్కువ అధికారాలుంటాయి. రాజ్యాంగంలోని 73వ సవరణకు ఏపీ పంచాయతీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా ఉందన్న విశ్లేషణలు మొదటి నుంచి వస్తోంది. దీంతో గ్రామసచివాలయాలు ఉండవనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకే గ్రామసచివాలయాలు వీఆర్వో వ్యవస్థ తీసుకొచ్చారు. సర్పంచ్, కార్యదర్శుల అధికారాలకు ఎలాంటి ఆటంకం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించినా ప్రయోజనం లేకుండా పోతోంది. వీఆర్వోలకు అధికారాలు అప్పగించడంపై అందరిలో వ్యతిరేకత వస్తోంది. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల అధికారాలు లాగేసుకోవడమేమిటని హైకోర్టు అభిప్రాయపడింది.
స్టేట్ కు ముఖ్యమంత్రి ఎలాగో పంచాయతీలకు సర్పంచ్ కూడా అదే విధంగా అదిపతి అని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయంతో గ్రామ సచివాలయాల వ్యవస్థపై ప్రభావం పడే సూననలు కనిపిస్తున్నాయి. పంచాయతీలకే అన్ని అధికారాలు ఉన్నా వీఆర్వోలకు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్ననిర్ణయాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఉంటున్నాయి. అధికారులను సైతం ఇబ్బందులకు గురి చేసేలా జీవోలు తీసుకురావడం వెనుక ఆంతర్యమేమిటో అర్తం కావడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. సర్పంచ్ అధికారాలను తొక్కి పట్టడం అంటే గ్రామ వ్యవస్థ అతలాకుతలం అయ్యే వీలుంటుంది. దీనిపై ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి జీవో నెం.2ను మార్చాలని సూచిస్తున్నారు.