AP High Court: ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గొడవలు చెలరేగాయి. కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడంపై దుమారం రేగుతోంది. రాష్ట్రంలో 144 సెక్షన్ విధించే వరకు పరిస్థితి వెళ్లిందంటే ఎంతటి రాద్ధాంతం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా పేరు మారిస్తే ఇంత గొడవలు చేయడమేమిటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీనిపై ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్డడంతో ఆయనను మందలించింది. మరోసారి ఇలాంటి కేసులు తెస్తే రూ.50 లక్షలు జరిమానా విధిస్తామని చెప్పడం కొసమెరుపు.

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? జిల్లా పేరు మారిస్తే ఇంత అలజడి సృష్టించడమా? అది కూడా ఓ ముఖ్య నాయకుడి పేరు పెట్టడంపై విమర్శలు రావడం ఆందోళనకరమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు చెలరేగి గొడవలకు కారణం కావడం బాధాకరమే. ప్రభుత్వం తీసుకున్న పేరు మార్పు నిర్ణయంపై అల్లర్లు కొనసాగడం వ్యూహాత్మకంలో భాగంగానే జరిగినట్లు తెలుస్తున్నా అది కరెక్ట్ కాదనే వాదనలు వస్తుండటం తెలిసిందే.
Also Read: Uddhav Thackeray: హవ్వా.. వెన్నుపోటు గురించి శివసేన ‘ఉద్దవ్’ మాట్లాడుతున్నారు
దీంతో రాష్ట్రంలో జిల్లా పేరు మార్పులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసమే. కానీ ఎందుకో అల్లర్లు మాత్రం అందరిని కలవరపరిచాయి. దీంతో ప్రభుత్వ తీరుపై ఓ వ్యక్తి ఏకంగా హైకోర్టు ను ఆశ్రయించడంతో కోర్టు ప్రభుత్వానికి మద్దతు పలికింది. జిల్లా పేరు మార్పుతో జరిగిన నష్టమేంటో తెలియడం లేదని సూచించింది. అనవసరంగా గొడవలు సృష్టించి ప్రభుత్వాన్ని నిందించడం భావ్యం కాదని హెచ్చరించింది. దీంతో పిటిషనర్ కోర్టుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తామని చెప్పడంతో గత నెల 24నే అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను ధ్వంసం చేశారు. దీంతో ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చి ఇప్పుడు జిల్లా పేరును మార్చడంతో గొడవలు రేగడం గమనార్హం. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చర్యలు తీసుకోవడం సమంజసం కాదని హెచ్చరించింది. జిల్లా పేరు మార్పులో ఏం జరిగిందని ప్రశ్నించింది. పేరు మారిస్తేనే ఇంతటి రాద్ధాంతం చేయడమేమిటని నిలదీసింది. ఇంకోసారి ఇలాంటి చర్యలు తీసుకుంటే చట్టపరంగా శిక్షార్హులవుతారని సూచించింది.
[…] […]