https://oktelugu.com/

Hero Suman: సినీ హీరో సుమన్ పొలిటికల్ ఎంట్రీ.. చేరేది ఆ పార్టీలోనే.. పోటీ అక్కడి నుంచే

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుమన్ సీనియర్ యాక్టర్. చిన్న ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి తక్కువ కాలంలోనే పెద్ద హీరోగా ఎదిగారు. తరువాత వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలతో సినిమాలకు కొద్ది రోజులు పాటు దూరమయ్యారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 28, 2024 / 01:08 PM IST
    Follow us on

    Hero Suman: టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సుమన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అదే జరిగితే ఏ పార్టీలో చేరనున్నారు? ఏపీలోనా? తెలంగాణలోనా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్ల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. కానీ ఏదో ఒక పార్టీలో చేరి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న తలంపుతో ఉన్నారు.

    తెలుగు సినీ ఇండస్ట్రీలో సుమన్ సీనియర్ యాక్టర్. చిన్న ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి తక్కువ కాలంలోనే పెద్ద హీరోగా ఎదిగారు. తరువాత వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలతో సినిమాలకు కొద్ది రోజులు పాటు దూరమయ్యారు. తిరిగి సినీ కెరీర్ ప్రారంభించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. కానీ కొన్ని రకాల అవకాశాలను చేజార్చుకున్నారు. ప్రస్తుతం ఆయన సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. అందుకే ఈ సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని.. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని.. ప్రజా ప్రతినిధిని కావాలని భావిస్తున్నారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అన్న బలమైన చర్చ నడుస్తోంది.

    సుమన్ వైసీపీలో చేరి ఏపీలో రాజకీయం చేస్తారని వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల్లో జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరతారని టాక్ నడుస్తోంది . రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి సుమన్ పోటీ చేస్తారని కూడా ఒక ప్రచారం ఉంది. ఇక్కడ నుంచి దర్శకుడు వివి వినాయక్, కమెడియన్ అలీ పోటీ చేస్తారని టాక్ నడిచింది. కానీ వారు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీంతో రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్న సుమన్ తో వైసిపి పెద్దలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు సుమన్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సుమన్ ఇటీవల జగన్ కు అనుకూలంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

    మరోవైపు తెలంగాణ రాజకీయాల్లోకి సుమన్ ఎంట్రీ ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. బిజెపి నుంచి ఖమ్మం లోక్ సభ స్థానానికి సుమన్ పోటీ చేస్తారని తెలుస్తోంది. సుమన్ గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన అయితే ఖమ్మం లోక్ సభ స్థానం ఈజీగా గెలవవచ్చని బిజెపి హై కమాండ్ భావిస్తోంది. సుమన్ ప్రధాని మోదీ విధానాలపై అనుకూలంగా మాట్లాడుతుంటారు. దాదాపు బిజెపికి దగ్గరగా ఉంటారు. ఈ పరిణామాల క్రమంలో సుమన్ ఏపీలో ఎంట్రీ ఇస్తారా? తెలంగాణ రాజకీయాల వైపు మొగ్గు చూపుతారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే వైసిపి సుమన్ కోసం బలంగా ప్రయత్నం చేస్తోంది. పవన్ కళ్యాణ్ రూపంలో బలమైన ప్రత్యర్థి ఉండడంతో.. వీలైనంత వరకు పార్టీలో సినీ గ్లామర్ తెప్పించాలని జగన్ భావిస్తున్నారు. అయితే వైసీపీలోకి వెళితేనే గెలుపు అందుకోవచ్చని సుమన్ ఆలోచన చేస్తున్నారు. మరోవైపు బిజెపి మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున.. బిజెపిలో చేరితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని సుమన్ అంచనా వేస్తున్నారు. సుమన్ రాజకీయ ఎంట్రీ పై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.