Pawan Kalyan- Actor Nandu: ఏపీ రాజకీయాల్లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జనసేన పార్టీ పొత్తు విషయంపై క్లారిటీ వచ్చిందా..? పొత్తుపై పవన్ ఏమనుకున్నా.. అభిమానుల మనసుల్లో ఏముంది..? ఎవరి అలయన్స్ చేరాలని కోరుతున్నారు..? కొంతకాలం జనసైనికుల్లో సందిగ్ధ వ్యవస్థ నెలకొన్న తరుణంలో తాజాగా ఓ యంగ్ హీరో నెట్టింట్లో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో ఆయన చెబుతూ ఆసక్తి రేపాడు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఏం పోస్టు పెట్టాడు..? పవన్ ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నాడు..?

అటు సినిమాల్లోనూ.. ఇటు రాజకీయాల్లోనూ పవన్ బిజీగా మారాడు. దీంతో పవన్ కు ప్రజాభిమానులే కాకుండా సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాల్లో నటిస్తున్న యంగ్ హీరోలు సైతం పవన్ కోసం ఏం చేయడానికైనా రెడీ అంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో నందు ఒకరు. నందు నటించింది కొన్ని సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రముఖ సింగర్ గీతామాధురి భర్తగా కూడా నందు సుపరిచితుడే. అయితే ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. తన భార్య గీతామాధురి, కూతురు ఫొటోలత్ హల్ చల్ చేస్తుంటారు. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ పై ఓ కామెంట్ చేసిన చర్చల్లో నిలిచాడు. ఆయన చేసిన కామెంట్ పై జనసేన వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.
Also Read: Jr NTR: థియేటర్ లో సీట్లు విరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్..షాక్ లో ఫాన్స్
ఇటీవల జరిగిన ఓ సభలో పవన్ బీజేపీతో మాత్రమే పొత్తు పెట్టుకుంటామని అన్నారు. మిగతా పార్టీల గురించి ఎన్నికల వరకు ఆలోచిస్తామని అన్నారు. వైసీపీని గద్దె దించేందుకు మిగతా పార్టీలో కలిసి వేళ్లే గురించ ఆలోచిస్తామని చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీజేపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా సాగుతోంది. ఈ రెండు పార్టీల నాయకులు ఎవరిదారి వారిదే అన్నట్లుగా వెళ్తున్నారు. అయితే పవన్ మాత్రం కొందరు స్థానిన నాయకులు వారి పరిస్థితుల ఆధారంగా నడుచుకుంటారని అన్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నందు పొత్తు విషయంపై కామెంట్ చేశాడు.

జనసేన పార్టీ గుర్త టీ గ్లాన్ అని తెలిసిందే. టీ ఉన్న గ్లాస్ పై జనసేన గుర్తుతో ఓ ఫొటో పెట్టిన నందు పవన్ ‘ప్రజలతో పొత్తు’ అని కామెంట్ చేశాడు. ప్రజాపుత్రుడు పవన్ అంటూ పోస్టు పెట్టి కాకరేపాడు. ఈ ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. జనసైనికులు దీనిని వైరల్ చేస్తున్నారు. పవన ఎప్పుడూ ప్రజలతోనే ఉంటారని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికీ వేల మంది లైకులు కొట్టారు. అయితే ఈ విషయం పవన్ వరకు చేరలేదు. ఒకవేళ పవన్ చూస్తే ఏ విధంగా రెస్పాన్స్ అవుతారోనని ఎదురుచూస్తున్నారు.
సినిమాల్లో హీరో అయినా నందు మొదటి నుంచి మెగా ఫ్యాన్ గానే ఉంటున్నారు. గతంలోనూ నందు పవన్ గురించి చాలా పోస్టులు పెట్టారు. అయితే ఇప్పుడు పొలిటికల్ గా పోస్టుపెట్టడం ఆసక్తిగా మారింది. దీంతో సినీ ఇండస్ట్రీలోనూ పవన్ కు మద్దతు ఉందనే విషయం అర్థమవుతోంది. 2019 ఎన్నికల్లో దెబ్బతిన్న పవన్ ఈసారి ఎలాగైన అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మిగతా పార్టీలపై విసుగు చెందిన చాలా మంది జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి పవన్ మానియా ఆకట్టుకుంటుందా..? చూడాలి మరి.
Also Read:Tamil Star Hero Vijay: తమిళ హీరో విజయ్ ఆఫీస్ లో మృతదేహం
[…] […]
[…] […]