క్యారెక్టర్ ఆర్టిస్ట్ ‘హేమ’కి రాజకీయాలు కొత్తేమి కాదు. ఆమెకు ఎమ్మెల్యే అవ్వాలని ఒక కోరిక ఉంది. ఎలాగూ జీవితంలో ఎమ్మెల్యే అవుతాననే నమ్మకం లేదు కాబట్టి.. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో జాయిన్ అయి, మళ్ళీ రాజకీయాలను విరమించుకుంది. అయితే ఇటీవల తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది ఈ ఆంటీ. ఈ నెల 17న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నకల్లో బీజేపీ అభ్యర్థి రత్నప్రభని అఖండ మెజార్టీతో గెలిపించాలని హేమ ప్రచారం చేస్తూ తన వంతు ప్రభావాన్ని చూపించడానికి తెగ కష్ట పడుతుంది.
అయితే ఆమె కష్టం గుర్తించాల్సిన నెటిజన్లు ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో హేమ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురవుతోంది. ఇంతకీ హేమ ఏమి కామెంట్ చేసిందంటే.. “మీరు అందరూ ఓటు వేసి లోకసభ అభ్యర్థి రత్నప్రభ గారిని అసెంబ్లీకి పంపండి” అని హేమ తెగ ఆవేశ పడిపోతూ మొత్తానికి ఏం మాట్లాడుతుందో ఆలోచించకుండానే తెగ మాట్లాడేసింది. ఇప్పుడు ఈ మాటలే ఆమెను అడ్డంగా బుక్ చేశాయి. “లోక్ సభ అభ్యర్థిని అసెంబ్లీకి పంపాలా అక్కా…” అంటూ నెటిజన్లు ఆమె పై ట్రోలింగ్ కి దిగారు.
పాపం హేమ ఇంతకుముందు జై సమైక్యాంధ్ర పార్టీ ప్రచారంలో బాగానే పాల్గొంది. అయినా ఆమెకు రాజకీయ ప్రచారాలు ఇంకా ఒంటబట్టినట్టు లేవు. అన్నట్టు హేమ రాజకీయం చాల రకాలుగా మలుపు తిరిగింది. జై సమైక్యాంధ్ర పార్టీ దుకాణాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తేసిన తరువాత.. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న హేమ, ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరింది. కానీ వైఎస్సార్సీపీలో ఆమె జూనియర్ ఆర్టిస్ట్ రేంజ్ లోనే మిగిలిపోయింది. దాంతో ప్రస్తుతం బీజేపీ కండువా వేసుకొంది.