Hats off to Pawan Kalyan రాజకీయాలకు భిన్నంగా ప్రత్యర్థులు చేసే మంచి పనులను స్వాగతించే మనసున్నోడే నిజమైన నాయకుడు. ప్రస్తుతం అలాంటి లక్షణాలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి తప్ప ఎవరికీ లేవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా వైజాగ్ ని గత కొంత కాలం క్రితమే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మరియు MNC కంపెనీలు సమ్మిట్ ద్వారా సమావేశం అయ్యారు.
ఈ సమ్మిట్ గురించి విచారించిన పవన్ కళ్యాణ్ అది నిజమే అని అర్థం చేసుకొని వైసీపీ పార్టీ కి కృతఙ్ఞతలు తెలియచేస్తూ ఒక వ్యాసం ట్విట్టర్ లో రాసాడు.ఇది చదివిన ప్రతీ ఒక్కరు లీడర్ అంటే ఇలా ఉండాలి, రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారు అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.వైసీపీ పార్టీ నాయకులు కూడా పవన్ వ్యవహరించిన తీరుని స్వాగతించారు. ఎన్నోసార్లు పవన్ ను తిట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆయన తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడాన్ని చూసి ‘పవన్ పరిణతి నిర్ణయానికి హాట్సాఫ్’ అంటూ కొనియాడుతున్నారు..
పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంపై ప్రేమ రాజకీయాల కతీతం.. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.