Kodali Nani: వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో పాటు కొంతమంది నేతలను ఓడించడం, రాజకీయంగా చెక్ చెప్పడం చంద్రబాబు ముందున్న కర్తవ్యం. అటు టీడీపీని పవర్ లోకి తేవడం ఎంత ముఖ్యమో.. వారి పొలిటికల్ గా దెబ్బతీసి రివేంజ్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యంగా మారిపోయింది. టీడీపీలో ఎదిగి.. పదవులు అనుభవించి పరాయి పంచన చేరిన కొడాలి నాని, వల్లభనేని వంశీలను రాజకీయంగా చెక్ చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు ఏ అవకాశాన్ని వదలకూడదని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా కొడాలి నాని పై బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చంద్రబాబు వెతుకుతున్నారు. కానీ సరైన నాయకుడు తారసపడలేదు. అటు నందమూరి కుటుంబసభ్యులను బరిలో దించాలని ప్రయత్నిస్తున్నారు. నందమూరి కుటుంబాన్ని కార్నర్ చేసుకునే కొడాలి నాని ఇష్టానుసారంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. అందుకే చంద్రబాబు నందమూరి కుటుంబంతోనే కొడాలి నానికి చెక్ చెప్పాలని వ్యూహం పన్నారు. దీనిని ఒక ఆప్షన్ గా ఉంచుకున్నారు.

మరోవైపు చంద్రబాబుకు మరో అరుదైన అవకాశం వచ్చింది. అది జనసేన రూపంలో. కొడాలి నానిని ఢీకొట్టాలంటే జనసేన సాయం అనివార్యంగా మారింది. గుడివాడలో పవన్ అభిమానులు ఎక్కువ. యూత్ లో పవన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అటు కాపు సామాజికవర్గం కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో ఇక్కడ జనసేన రోజురోజుకూ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొడాలి నాని ప్రధాన అనుచరులు ఒక్కొక్కరుగా జనసేనలో చేరుతున్నారు. నానికి రైట్ హ్యండ్ గా ఉండే పాలంకి బ్రదర్స్ ఇప్పటికే జనసేనలో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధమవుతున్నారు. అటు వంగవీటి రాధాక్రిష్ణకు సైతం ఇక్కడ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా గత ఎన్నికల్లో నానికే సపోర్టు చేశారు. దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగడమే కారణం. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు. రాధాక్రిష్ణ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే పరిస్థితి. మరోవైపు వైసీపీకి వ్యతిరేకంగా బలంగా పనిచేస్తారన్న ప్రచారం నేపథ్యంలో గుడివాడలోని రాధా ఫ్యాన్స్ జనసేన వైపు చూస్తున్నారు. కాపు సభలు కూడా జరుగుతున్న నేపథ్యంలో వంగవీటి రాధా ఎన్నికల ముందర జనసేనలో చేరుతారని.. గుడివాడలో పోటీచేస్తారని సమాచారం. ఈ క్రమంలోనే తన స్నేహితుడైనా సరే ‘కొడాలి నాని’ని ఓడించేందుకు రాధా రెడీ అయినట్టు సమాచారం. ఇక్కడి అత్యధిక కాపు ఓటు బ్యాంకుతో రాధానే రంగంలోకి దించడానికి జనసేన రెడీ అయ్యిందట.. రాధా చేరడమే ఆలస్యం గుడివాడను రాధాకు కేటాయించాలని.. కొడాలి నానిని ఓడించాలని ఇటు పవన్ కళ్యాణ్ తోపాటు చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారట.. చంద్రబాబు కూడా తెలివిగా ఈ సీటును పొత్తులో జనసేనకు విడిచిపెట్టేందుకు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో కొడాలి నానిని కొట్టే మగాడు ‘వంగవీటి రాధా’నే అని అంటున్నారు.
ఇటీవల నియోజకవర్గంలో జనసేన దూకుడు పెంచింది. రహదారుల సమస్యపై ఏకంగా కొడాలి నాని ఇంటి నే చుట్టుముట్టేందుకు జన సైనికులు ప్రయత్నించారు. అయితే దీనిపై నాని పెద్దగా రియాక్టు కాలేదు. నియోజకవర్గంలో పవన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే ఇందుకు కారణం. వారిని ఏమైనా అంటే కాపు ఓటు బ్యాంకు కూడా దూరమయ్యే చాన్స్ ఉంది. అందుకే ఈ ఘటన తరువాత పేర్ని నానితో కలిసి కొడాలి నాని సీఎం జగన్ ను కలిశారు. నియోజకవర్గంలో రోడ్ల సమస్య గురించి ప్రస్తావించారు. కొడాలి నానిపై జనసేన డోసు పెంచినా పెద్దగా స్పందించలేదు. దీనిబట్టి జనసేన అంటే కొడాలి నానికి భయం ఉన్నట్టు అర్ధమవుతోంది. అందుకే దీనిని చాన్స్ గా తీసుకున్న చంద్రబాబు జనసేన ద్వారా తన టార్గెట్ ను సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నందమూరి కుటుంబాన్ని ఒక ఆప్షన్ గా ఉంచుకుంటూనే.. జనసేనను రెండో ఆప్షన్ గా రెడీ చేసుకున్నారు.

గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన ప్రయోగాలు తెలుగు తమ్ముళ్లకు నచ్చలేదు. ఎప్పటికప్పుడు అభ్యర్థులను మార్చుతుండడం కూడా పార్టీకి మైనస్ గా మారినట్టు వారు చెబుతున్నారు. ఇటువంటి సమయంలో అచీతుచీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొడాలి నాని గెలుపునకు తెలుగుదేశం పార్టీయే కారణమన్న టాక్ ఉంది. ఆయన ఉన్నది వైసీపీలో అయినా.. టీడీపీ వనరులను సద్వినియోగం చేసుకొంటున్నారు. రాష్ట్రంలో టీడీపీని సమర్థించే కమ్మ సామాజికవర్గం ఇక్కడ మాత్రం నానికే మద్దతు తెలుపుతోంది. ఎన్టీఆర్ సెంటిమెంట్ ను సైతం రగిల్చి నాని బాగానే లబ్ధి పొందుతున్నారు. అయితే వాటిని చెక్ చెప్పడంలో చంద్రబాబు విపలమవుతున్నట్టు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లోనైనా సరైన వ్యూహంతో వెళ్లాలని టీడీపీ శ్రేణులు అధినేతకు విన్నవిస్తున్నాయి