https://oktelugu.com/

AP Govt: నిధులు, అభివృద్ధి.. వైసీపీలో ముసలం.. జగన్ ను ముంచేస్తుందా?

AP Govt: అప్పులు తేవాలి.. కుప్పగా పోసి ప్రజలకు పంచాలి..సంక్షేమ పథకాల పేరిట జగన్ చేస్తున్న పందేరం ప్రజలకు సంతోషాన్ని ఇచ్చినా వారికి కనీస సౌకర్యాలు కల్పించలేని నిస్సహాయ స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉండిపోయిందన్న విమర్శలు సొంత వైసీపీ నుంచే వినిపిస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే.. ఒక మున్సిపల్ చైర్మన్.. ఆఖరుకు కార్పొరేటర్ కూడా తన కాలనీల్లో రోడ్లు, మురికికాలువలు.. కనీస వసతులు కల్పించలేని దీన స్థితిలో ఉన్నారంటే అంతకంటే దౌర్భగ్యం మరొకటి ఉండదు. తాజాగా కర్నూలు కార్పొరేషన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 30, 2021 / 12:25 PM IST
    Follow us on

    AP Govt: అప్పులు తేవాలి.. కుప్పగా పోసి ప్రజలకు పంచాలి..సంక్షేమ పథకాల పేరిట జగన్ చేస్తున్న పందేరం ప్రజలకు సంతోషాన్ని ఇచ్చినా వారికి కనీస సౌకర్యాలు కల్పించలేని నిస్సహాయ స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉండిపోయిందన్న విమర్శలు సొంత వైసీపీ నుంచే వినిపిస్తున్నాయి. ఒక ఎమ్మెల్యే.. ఒక మున్సిపల్ చైర్మన్.. ఆఖరుకు కార్పొరేటర్ కూడా తన కాలనీల్లో రోడ్లు, మురికికాలువలు.. కనీస వసతులు కల్పించలేని దీన స్థితిలో ఉన్నారంటే అంతకంటే దౌర్భగ్యం మరొకటి ఉండదు.

    AP Govt

    తాజాగా కర్నూలు కార్పొరేషన్ లో తాను గెలిచినప్పటి నుంచి నా కాలనీలో ఒక్క అభివృద్ధి చేయలేదని.. కాలనీ వాసులు నిలదీస్తున్నారని.. సొంత వైసీపీకి చెందిన 43వ డివిజన్ కార్పొరేటర్ మునెమ్మ ఏకంగా కౌన్సిల్ సమావేశంలోనే ఆందోళన నిర్వహించారంటే వైసీపీ పాలనలో మౌలిక వసతుల కోసం నిధులు ఇవ్వడం లేదని తేటతెల్లమైంది. దీనికోసం సొంత పార్టీ నేతలే ఆందోళన చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

    Also Read:  బ్లాక్ మనీ కేసులో ఇరుకున్న ఏపీ రాజకీయ నేత?

    ప్రజలకు పంచేది ఎప్పుడూ గుర్తుండదు.. చంద్రబాబు తన చివరి సమయాల్లో పసుపు కుంకుమ పేరిట ప్రజల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేశాడు. అయినా బాబును చిత్తుగా ఓడించి వైసీపీని గెలిపించారు. ఇప్పుడు వైసీపీ గద్దెనెక్కినప్పటి నుంచి అదే చేస్తోంది. అభివృద్ధిని, మౌలిక వసతులను గాలికి వదిలేసింది. నిధుల కోసం వైసీపీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

    ఏపీ అప్పుల్లో ఉంది. జీతాలు, పెన్షన్లకే సరిపోవడం లేదు. ఇక అభివృద్ధికి ఏమాత్రం నిధులు సరిపోని పరిస్థితి. గత వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే అప్పట్లో రోడ్లపై శ్రమదానం చేసినా వైసీపీ సర్కార్ రోడ్లను బాగుచేయించిన పాపాన పోలేదు. ఇప్పటికీ ఏపీ వ్యాప్తంగా పరిస్థితి అలానే ఉంది. మున్సిపాలిటీల్లో చిన్న మరమ్మతులకు కూడా డబ్బులు లేని పరిస్థితి. వైసీపీ ప్రజాప్రతినిధులంతా అధికారంలోకి వచ్చామే కానీ పనులు చేయలేకపోతున్నామని ఉడికిపోతున్నారు. అదిష్టానాన్ని గట్టిగా అడగలేకపోతున్నారు. ఈ అసంతృప్తి జ్వాలలు జగన్ సర్కార్ ను చివరి పాలనరోజుల్లో దహించే అవకాశాలున్నాయి. సో జగన్ ఇప్పటికైనా నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తేనే రాబోయే ఎన్నికలకు సమర్థంగా వెళ్లగలరు. లేదంటే చంద్రబాబు లాగానే పందేరానికి పోయి ఓడిపోయే చాన్సులే ఎక్కువ ఉన్నాయంటున్నారు.

    Also Read:   ఏపీతో ఒప్పందాలు.. తెలంగాణలో పెట్టుబడులు..