https://oktelugu.com/

Special status: ప్రత్యేక హోదాపై ‘ఏపీ’ ఆశలు వదులుకున్నట్లేనా?

Special status: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ఏపీకి ద్రోహం చేశారంటూ విమర్శలు గుప్పించారు. ఈనేపథ్యంలోనే నాటి ప్రభుత్వం తొలుత ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నా ఆ తర్వాత మేల్కోని హోదా కోసం పట్టుబట్టిన సంగతి అందరికి తెల్సిందే..! ఈనేపథ్యంలోనే ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండు దక్కకుండా పోయాయనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తమకు అధికారం […]

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2021 / 01:50 PM IST

    Andhra Pradesh

    Follow us on

    Special status: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ఏపీకి ద్రోహం చేశారంటూ విమర్శలు గుప్పించారు. ఈనేపథ్యంలోనే నాటి ప్రభుత్వం తొలుత ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నా ఆ తర్వాత మేల్కోని హోదా కోసం పట్టుబట్టిన సంగతి అందరికి తెల్సిందే..!

    Andhra Pradesh

    ఈనేపథ్యంలోనే ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండు దక్కకుండా పోయాయనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తమకు అధికారం ఇస్తే ఏపీకి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఇదే విషయంపై బల్లగుద్ది మరీ వాదించారు. దీంతో ప్రజలంతా ఏకమై వైసీపీకి గత సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మండమైన మెజార్టీని కట్టబెట్టారు.

    తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై నోరుమొదలపడం లేదు. వైసీపీ ఎంపీలు సైతం పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి గట్టిగా పోరాడిన దాఖలాల్లేవు. ఈక్రమంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం పార్లమెంట్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవాలని సూచిస్తోంది.

    జగన్ అధికారంలోకి వచ్చాక సైతం పలుమార్లు ప్రత్యేక హోదాకు కట్టబడి ఉన్నట్లు  స్ఫష్టంచేశారు. అయితే ఆచరణలో మాత్రం ప్రత్యేక హోదా కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరిగినపుడు మాత్రం వైసీపీ ఎంపీలో పార్లమెంటులో పోరాటం చేసినట్లు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

    కేంద్రంలో మోదీ సర్కారు పూర్తి మెజార్టీ ఉందని దీంతో ఏం చేయలేక పోతున్నామని సీఎం సహా వైసీపీ ఎంపీలు వాదిస్తున్నారు. దీంతో కొంతకాలంగా ప్రత్యేక హోదా అంశం అటకెక్కింది. అయితే తాజాగా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి పంకజ్ చౌదురి ఏపీకి ఇప్పటికే 16వేల కోట్ల రూపాయాలను ప్రత్యేక హోదా నిధులు ఇచ్చామని ప్రకటించడం సంచలనంగా మారింది.

    Also Read: ఆ జీవోలు రహస్యమా.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపాటు..!

    జగన్ సర్కార్ ఎక్కడా కూడా ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంటున్నట్లు ప్రకటించలేదు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే జగన్ సర్కారు ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటుందనే భావన కలుగుతోంది. నిజంగా ప్రభుత్వం ప్యాకేజీకి ఒప్పుకుంటే మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా కథ ముగినట్లేనని తెలుస్తోంది. ఎందుకంటే రేపటి రోజుకు ఎంపీలు హోదా గురించి అడిగితే  ప్యాకేజీ ఇచ్చాం కాదా? అని కేంద్రం వాదించే అవకాశం ఉంటుంది.

    సీఎం జగన్ ఒకవేళ ఇలా చేస్తే మాత్రం ఏపీకి ద్రోహం చేసినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీ సహా అన్ని పార్టీలు ప్రజలను మసిపూసి మారేడుకాయ చేస్తున్నట్లేననే కామెంట్స్ విన్పిస్తున్నారు. ఈ విషయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    Also Read: వైసీపీ నేతల విషయంలో పోలీసుల తీరు షరా మాములే..!