Dwakra Group : ఏపీలో దారుణం.. మహిళా సంఘాలను వదలని వైసీపీ సర్కార్

Dwakra Group : కాదెవరు బెదిరించడానికి అనర్హం అన్నట్టుగా మారింది ఏపీలోని పరిస్థితి. ప్రతిపక్షాలను.. ఎదిరించే నేతలను, సోషల్ మీడియా నెటిజన్లనే కాదు.. తమకు సహాయంగా లేని మహిళా సంఘాలను,, ద్వాక్రా గ్రూపులను సైతం వైసీపీ సర్కార్ బెదిరిస్తూ తమ పథకాలకు వాడుకుంటున్న దారుణ పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. ఏపీలో వైసీపీ కార్యక్రమాలకు హాజరు కాకుంటే వారికి సంక్షేమ పథకాలు, లోన్లు ఆపేస్తామని.. గ్రూపులోంచి తీసేస్తామని స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఆదేశాలు ఉన్నట్టుగా మహిళా […]

Written By: NARESH, Updated On : October 14, 2022 6:37 pm
Follow us on

Dwakra Group : కాదెవరు బెదిరించడానికి అనర్హం అన్నట్టుగా మారింది ఏపీలోని పరిస్థితి. ప్రతిపక్షాలను.. ఎదిరించే నేతలను, సోషల్ మీడియా నెటిజన్లనే కాదు.. తమకు సహాయంగా లేని మహిళా సంఘాలను,, ద్వాక్రా గ్రూపులను సైతం వైసీపీ సర్కార్ బెదిరిస్తూ తమ పథకాలకు వాడుకుంటున్న దారుణ పరిస్థితులు ఏపీలో ఉన్నాయి.

ఏపీలో వైసీపీ కార్యక్రమాలకు హాజరు కాకుంటే వారికి సంక్షేమ పథకాలు, లోన్లు ఆపేస్తామని.. గ్రూపులోంచి తీసేస్తామని స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఆదేశాలు ఉన్నట్టుగా మహిళా సంఘాల లీడర్ మాట్లాడిన ఆడియో క్లిప్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ మహిళా సంఘం నేత.. గ్రూపులో వైసీపీ సభలు, సమావేశాలకు హాజరు కాని మహిళలను బెదిరిస్తూ.. వైసీపీ సర్కార్ ఆదేశాలంటూ మీటింగ్ లకు హాజరు కావాలని హుకూం జారీ చేసింది. రాకపోతే గ్రూపులోంచి తీసేస్తామని.. సంక్షేమ పథకాలు నిలిపేస్తామని.. లోన్లు ఆపేస్తామని బెదిరింపులకు దిగింది. ఈ ఆడియోలు చూసి ఏపీ ప్రజలు నేతలు విస్తుపోతున్న పరిస్థితి నెలకొంది.

వైసీపీ కార్యక్రమాల కోసం అక్రమంగా ద్వాక్రా గ్రూపులను వాడుకుంటున్నారని.. ఇష్టం లేని మహిళలలు రాకుంటే హింసిస్తున్న పరిస్థితి ఏపీలో నెలకొందని విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలు అని కూడా చూడకుండా వైసీపీ నేతల ఆగడాలు శృతి మించిపోతున్నాయని అంటున్నారు.

ఆదర్శంగా పొదుపులతో దూసుకెళ్లే ద్వాక్రా గ్రూప్ లు ఇప్పుడు వైసీపీ పాలనలో ఈ విధంగా అయిపోయాయని పలువురు వాపోతున్నారు..ఈరోజు బెదిరిస్తున్నారని.. రేపు మీ ఇంటికి వచ్చి లాక్కొని వెళ్తారని సోదరులారా సోదరీమణులారా గమనించండి అంటూ పలువురు సోషల్ మీడియాలో నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది.