Amit Shah- GVL: విశాఖపట్నం బీజేపీ సభపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఉత్తరాది వ్యక్తులు దక్షిణ రాష్ట్రాలకు వచ్చినప్పుడు వారి సందేశాన్ని ప్రజలకు వివరించేందుకు పార్టీలోని వ్యక్తులనే అనువాదకులుగా ఏర్పాటు చేసుకుంటారు. ఆ అనువాదకులు ఎంత సమర్ధవంతంగా అనువాదం చేస్తే సభ అంత సక్సెస్ అవుతుంది. కానీ కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా విశాఖపట్నంలో జరిగిన సభలో అనువాదకుడిగా నియమించుకున్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు అనువాదం అంతా పేలవంగా సాగింది. ఒకానొక దశలో అమిత్ షా తీవ్ర అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
చాలా రోజుల తర్వాత అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ సభను ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి వాడివేడీగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా, నడ్డాల పర్యటన అత్యంత ఆసక్తిని రేకెత్తించింది. అనుకున్న విధంగా పొత్తుల గురించి ప్రస్తావన లేకపోయినప్పటికీ, 9 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరించేందుకు అమిత్ షా ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు.
సాధారణంగా హిందీ సగటు మనిషికి అర్థమవుతుంది. అమిత్ షా చెబుతున్న ప్రతి ఒక్క మాట బలంగా క్షేత్రస్థాయిలో వెళ్లాలని ఉద్దేశంతో బీజేపీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన జీవీఎల్ నరసింహారావుకే అనువాదం బాధ్యతను కూడా అప్పగించారు. రాష్ట్రంలో బీజేపీ ముఖ్య నాయకులుగా చెప్పుకుంటున్న చాలామంది ఆ సభలో తళుక్కుమన్నారు. వారంతా సభా వేదిక పై ఆసీనులై ఉండగా అమిత్ షా ప్రసంగం మొదలైంది. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రపంచంలో భారత దేశ ఔన్నత్యాన్ని, పరాక్రమతను అమిత్ షా వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. అయితే ఆయన మాటల్లోనే లోతును జీవీఎల్ అనువదించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు ఎక్కువయ్యాయి.
జీవీఎల్ అనువాదాన్ని వివిధ సినిమాల్లోని సీన్లతో, డైలాగులతో పోల్చుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఒకానొక సందర్భంలో అమిత్ షా ”నేను చెబుతున్నది ఏంటి.. మీరు మాట్లాడుతున్నదేంటి” అని జీవీఎల్ పై అసనం చేస్తున్న వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులు ఏర్పాటు చేసుకునే సభల్లో చిన్న చిన్న పొరపాట్లపై దృష్టి పెట్టకపోతే అభాసుపాలు కాక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది
GVL గాడిని అమిత్ షా గారు ఏమి అన్నారో తెలుసా. . .
అరేయ్ చెవిటి నాకొడక జగన్ రెడ్డి ని తిట్టినవి సరిగా చెప్పిసావు pic.twitter.com/IbT2OjmQp9
— Chandu (@YOLO_Beliver) June 12, 2023