Homeజాతీయ వార్తలుగుప్‌కార్‌‌ కూటమికి స్నేహ ‘హస్తం’

గుప్‌కార్‌‌ కూటమికి స్నేహ ‘హస్తం’

Gupkar Alliance
ఇప్పటికే వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతుల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొంటున్న ప్రధాని మోడీకి.. జమ్ముకశ్మీర్‌‌ రాజకీయాలు మరింత తలనొప్పిలా మారాయి. రోజురోజుకూ అక్కడి రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. గ‌త ఏడాది క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన త‌ర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారిగా డీడీసీ ఎన్నిక‌లు నిర్వహించారు. ఇటీవల జరిగిన లోకల్‌ ఎన్నికల్లో గుప్‌కార్‌ కూటమే తన ఆధిపత్యాన్ని చాటింది. అదే ఊపుతో ఇప్పుడు తాజాగా కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టబోతోంది గుప్‌కార్‌ కూటమి. దీంతో బీజేపీకి ఇక్కడ చెక్‌ పెట్టాలని వ్యూహం రచిస్తున్నారు కూటమి నేతలు.

Also Read: ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు చెబుతారా?

దీంతో మంచు లోయలు.. ప్రకృతి సోయగాలకు కేరాఫ్‌ అయిన జమ్ములో రాజకీయ వేడి రగిలిస్తోంది. సమీకరణలు కూడా వేగంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన లోకల్‌ ఎన్నికల్లో 7 పార్టీలతో కూడిన గుప్‌కార్‌ కూటమి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇక్కడ బీజేపీకి చెక్‌ పెట్టాలంటే కాంగ్రెస్‌తో జత కట్టడమే వారికున్న ఏకైక మార్గమనే భావనకు వచ్చారు. అందుకే కాంగ్రెస్‌కి స్నేహ హస్తం అందిస్తున్నారు. దీంతో జమ్మూలో చక్రం తిప్పాలనుకుంటున్న బీజేపీకి చెక్‌ పెట్టేందుకు గుప్‌కార్‌ కూటమి పావులు కదుపుతోంది.

జమ్ము కశ్మీర్‌ జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల ఫలితాల్లో గుప్కార్‌ కూటమి 110 సీట్లు సాధించి, మొత్తం 13 జిల్లాల్లో ఆధిప‌త్యం కొన‌సాగించింది. బీజేపీ పార్టీ సొంతంగా 75 సీట్లలో విజ‌యం సాధించి ఆరు జిల్లాలను సొంతం చేసుకుంది. జ‌మ్మూ ప్రాంతంలో బీజేపీ త‌న హ‌వా కొన‌సాగింది. అటు, ఏడు పార్టీల‌తో కూట‌మిగా ఏర్పడ్డ గుప్కార్‌, క‌శ్మీర్‌లో పట్టు సాధించింది. కాగా.. న‌వంబ‌ర్ 28 నుంచి డిసెంబ‌ర్ 19 వ‌ర‌కు ఎనిమిది ద‌శ‌ల్లో జమ్ములో ఎన్నిక‌లు జ‌రిగాయి. 20 జిల్లాల్లోని 280 డీడీసీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ చేపట్టారు.

Also Read: వివేకా హత్య కేసు.. జగన్‌ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా..?

డీడీసీ ఎన్నిక‌ల్లో అత్యధికంగా బీజేపీకి 75 సీట్లు ద‌క్కాయి. ఇక ఆ త‌ర్వాత నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ 67, ఇండిపెండెంట్ 50, జ‌మ్ముక‌శ్మీర్ పీడీపీ 27, కాంగ్రెస్ 26, అప్నీ పార్టీ 12 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్నాయి. క‌శ్మీర్‌లో ఫారూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్‌కార్ కూట‌మికి 72 సీట్లు ద‌క్కాయి. అక్కడ బీజేపీ కేవ‌లం మూడు సీట్లను మాత్రమే గెలుచుకున్నది. ఇక జమ్ము ప్రావిన్సులో బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. జ‌మ్ము, ఉద‌మ్‌పూర్‌, సాంబా, క‌థువా, రీసాయి, దోడా ప్రాంతాల్లో బీజేపీ 71 సీట్లు సాధించింది. క‌శ్మీర్‌లో బీజేపీ తొలిసారి మూడు సీట్లను గెలుచుకుంది. అయితే ఏడు పార్టీలతో కూటమిగా ఏర్పడిన గుప్‌కార్‌ కూటమి జమ్ములో కాంగ్రెస్‌తో జతకట్టి బీజేపీ చెక్‌ పెట్టాలని చూస్తుడడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version