https://oktelugu.com/

Jinnah Tower: ఏపీ నడిబొడ్డున త్రివర్ణ జెండా ఎగరనీయని జగన్.. జాతీయ స్థాయిలో రచ్చ

Jinnah Tower:దేశంలో ఇప్పుడు బీజేపీ హవా నడుస్తోంది. ఆ పార్టీ సానుభూతిపరులు దేన్నైనా వైరల్ చేయగలరు.. ట్రెండ్ సెట్ చేయగలరు.. బీజేపీ ‘జాతీయవాదం’ ఇప్పుడు పవర్ ఫుల్ వెపన్ గా మారింది. దేశంలో ఎక్కడ ఏం జరిగినా.. దేశ భక్తికి చేటు చోసుకున్నా బీజేపీ వాదులు రెడీగా ఉంటారు. ఇప్పుడు వారి ధాటికి ఏపీ సీఎం జగన్ బుక్కైపోతున్నారు. తాజాగా గుంటూరులోని జిన్నా టవర్ పై గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘హిందూ వాహిని’ జాతీయ జెండాను ఎగురవేసేందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 27, 2022 / 09:47 AM IST
    Follow us on

    Jinnah Tower:దేశంలో ఇప్పుడు బీజేపీ హవా నడుస్తోంది. ఆ పార్టీ సానుభూతిపరులు దేన్నైనా వైరల్ చేయగలరు.. ట్రెండ్ సెట్ చేయగలరు.. బీజేపీ ‘జాతీయవాదం’ ఇప్పుడు పవర్ ఫుల్ వెపన్ గా మారింది. దేశంలో ఎక్కడ ఏం జరిగినా.. దేశ భక్తికి చేటు చోసుకున్నా బీజేపీ వాదులు రెడీగా ఉంటారు. ఇప్పుడు వారి ధాటికి ఏపీ సీఎం జగన్ బుక్కైపోతున్నారు.

    తాజాగా గుంటూరులోని జిన్నా టవర్ పై గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘హిందూ వాహిని’ జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించింది. పోలీసులు భారీగా మోహరించి హిందూ వాహిని సభ్యులను జాతీయ జెండా ఎగురవేయకుండా ఈడ్చి పడేశారు. పోలీసులతో లాక్కెళ్లి మరీ అరెస్ట్ చేశారు.

    గణతంత్ర దినోత్సవం నాడు దేశంలోని ఏ పౌరుడు అయినా సరే ఎక్కడైనా జాతీయ జెండాను ఎగురవేసేందుకు హక్కుంది. కానీ ఏపీలో మాత్రం జగన్ సర్కార్ నడిబొడ్డున ఉన్న గుంటూరు జిన్నా టవర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయనీయకుండా అడ్డుకోవడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇదేఇప్పుడు జగన్ పై విమర్శల వానకు కారణమైంది. జిన్నా టవర్ వద్ద అసలు జాతీయ జెండాను ఎందుకు హిందూ వాహిణి సభ్యులు ఎగురవేశారు. జగన్ సర్కార్ ఎందుకు అడ్డుకుంటోందంటే చరిత్రలోకి వెళ్లాల్సిందే..

    భారత్-పాకిస్తాన్ విభజనకు ముందు అప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు ‘మహ్మద్ అలీ జిన్నా’ 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గుంటూరులో భారీ సభకు రావడానికి ఒప్పుకున్నారు. జిన్నా చేతుల మీదుగా ఆవిష్కరించడానికి స్మారకస్తూపాన్ని ఆవిష్కరించాలనుకున్నారు. కానీ ఆయన రాలేకపోయారు. ఆయన సన్నిహితుడు వచ్చి ఈ టవర్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి దీనికి జిన్నా టవర్ పేరిట సర్కిల్ గా ప్రాచుర్యంలోకి వచ్చింది. గుంటూరులో ఇదే ల్యాండ్ మార్క్ గా మారింది. అయితే ఇదే జిన్నా భారత్ నుంచి వేరుపడి పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేసుకొని రెండు దేశాల మధ్య ఎంతటి అగాధాన్ని.. హింసను ప్రేరేపించేలా చేశాడో అర్థం చేసుకోవచ్చు. జిన్నా భారత్ ను, హిందువులను ఎంత ద్వేషించాడో.. పాకిస్తాన్ లో హిందువులపై ఎన్ని దాడులు జరిగాయో చూశాం..

    దేశ విభజనకు కారకుడైన జిన్నా పేరును తొలగించాలని ఇప్పటికే ఏపీ బీజేపీ పోరుబాట పట్టింది. జిన్నా పేరుతో ఉన్న స్తూపం పేరును మార్చాలని..లేదంటే దాన్ని తొలగించాలని బీజేపీ నేతలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. నిరసన తెలిపిన బీజేపీ నేతల అరెస్ట్ లు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే రిపబ్లిక్ డే సందర్భంగా ‘జిన్నా టవర్ ’పై జాతీయ జెండా ఎగురవేసేందుకు ‘హిందూ వాహిని’ పిలుపునిచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిన్నా టవర్ పై ప్రభుత్వమే జాతీయ జెండా ఎగురవేయాలని.. ప్రభుత్వం స్పందించకుంటే హిందూ వాహినితో కలిసి బీజేపీ నేతలే జాతీయ జెండా ఎగురవేస్తారని డిమాండ్ చేశారు.

    దీంతో పోలీసులు భారీగా మోహరించి హిందూ వాహినీ సంస్థ సభ్యులు జాతీయ జెండాలతో రాగానే విరుచుకుపడ్డారు. దీంతో జిన్నా టవర్ ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    ఇప్పుడీ వివాదం చినిగి చాటైంది. దేశభక్తులు, నెటిజన్లు ఏపీ సీఎం జగన్ ను ట్యాగ్ చేస్తూ ‘మనం భారత్ లో ఉన్నామా? పాకిస్తాన్ లో ఉన్నామా? జాతీయ జెండాను ఎందుకు ఎగరనీయరు’ అంటూ కామెంట్లు చేస్తూ విరుచుకుపడుతున్నారు. జాతీయ స్థాయిలోని ప్రముఖులు సైతం గుంటూరు జిన్నా టవర్ వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితుల ఫొటోలు షేర్ చేసి నిలదీస్తున్నారు. దీంతో జగన్ సర్కార్ వ్యవహారం జాతీయ స్థాయిలో రచ్చకు కారణమైంది.