కరోనా ప్రభావంతో..
దేశమంతా కరోనా భయంతో గజగజ వణుకుతోంది. దీంతో పాటు జీఎస్టీ భారం కూడా బాధితులను మరింత కుంగదీస్తోంది. కరోనా తీవ్రత దృష్ట్యా ఉపయోగించే మందులు, పరికరాల ఆధారంగా బిల్లుల్లో 15 నుంచి 20 శాతం భారం మోపుతోంది. కరోనా పరీక్షలతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వెలుపలికి వచ్చే సరికి జీఎస్టీ భారం తడిసి మోపెడవుతోంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జీఎస్టీ పరిధిలో..
జీఎస్టీ పరిధిలో పరికరాలు, మందులు, తదితర వస్తువులు ఉన్నాయి. దీంతో వాటిపై 12 శాతం మేర పన్ను పడుతోంది. వీటిలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, కొవిడ్ నిర్ధారణ కిట్లు, రీజెంట్లు, వెంటిలేటర్లు, శ్వాస పరికరాలు, మెకానికల్ విడి భాగాలు, పిల్టర్లు ఉన్న మాస్క్ లు, రబ్బర్ గ్లౌజ్ లు, రక్షణ కళ్లద్దాలు, బ్యాండేజీలు, ఆపరేషన్ కు సంబంధించినవి.
ఇంకా కొన్ని పరికరాలు 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. ఇందులో స్టెరిలైజేషన్ కు ఉపయోగించే ఇథైల్ అల్కహాల్, సబ్బులు, చర్మ శుభ్రతకు వాడేవి. శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు, ప్రమాదకర వ్యర్థాలు వేసేందుకు వాడే కవర్లు, ప్లాస్టిక్ తో చేసిన రక్షణ పరికరాలు, క్రిమిసంహారకాలు, టిష్యూ పేపర్ లు, న్యాప్ కిన్ లు, వస్ర్తంతో తయారు చేసిన గ్లౌజ్ లు, ఇతర రక్షణ ఉత్పత్తులు, సెల్యులోజ్ ఫైబర్ తో చేసిన మాస్క్ లు, తలకు వాడే నెట్ లు, రోగుల నుంచి ఫ్లూయిడ్స్ సేకరించే శానిటరీవేర్, ల్యాబొరేటరీ పరికరాలు, స్టెరిలైజేషన్ కు వాడేవి, థర్మామీటర్లు, సైకోమీటర్లు, హైగ్లోమీటర్, క్వాలిబరేటంగ్ మీటర్లు