https://oktelugu.com/

Janasena Chief Pawan Kalyan: జనసేన’పై పెరుగుతున్న ఇంట్రెస్ట్..: అసంతృప్తి నాయకులంతా పవన్ వైపు..?

Janasena Chief Pawan Kalyan: ఏపీలో ముందస్తు ఊహాగానాలు జోరందుకున్నాయి. గడువుకంటే మందే ఎన్నికలు నిర్వహించొచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుండడంతో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశంలో రాజకీయ పార్టీలో సన్నద్ధమవుతోంది. అధికార వైసీపీతో పాటు ప్రధాన పార్టీలైన టీడీపీ, బీజేపీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే మరో పార్టీ జనసేన కూడా చాప కింద నీరులా తమ కార్యకలాపాలు చేసుకుంటూ పోతుంది. గత ఎన్నికల్లో ఘోర […]

Written By:
  • NARESH
  • , Updated On : July 19, 2022 / 01:07 PM IST
    Follow us on

    Janasena Chief Pawan Kalyan: ఏపీలో ముందస్తు ఊహాగానాలు జోరందుకున్నాయి. గడువుకంటే మందే ఎన్నికలు నిర్వహించొచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుండడంతో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశంలో రాజకీయ పార్టీలో సన్నద్ధమవుతోంది. అధికార వైసీపీతో పాటు ప్రధాన పార్టీలైన టీడీపీ, బీజేపీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే మరో పార్టీ జనసేన కూడా చాప కింద నీరులా తమ కార్యకలాపాలు చేసుకుంటూ పోతుంది. గత ఎన్నికల్లో ఘోర పరాభావం తిన్న జనసేన ఈసారి అలా కాకుండా వ్యూహంతో ముందుకు వెళుతోంది. మొదట్లో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అన్ని పార్టీలకు పవన్ కీలకంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

    Pawan Kalyan:

    గత ఎన్నికల్లో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉండేది. బీజేపీ, కాంగ్రెస్ లు కనీస సీట్లలో గెలుచుకోకపోవడంతో ఆ పార్టీలు కనుమరుగయ్యాయి. అయితే జనసేన పరిస్థితి కూడా అలాగే ఉండేది. కానీ పార్టీ అధినేత పవన్ కొన్ని రోజలు కనుమరుగైనా ఆ తరువాత ప్రజా కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. రైతు సమస్యల నుంచి రోడ్డు సమస్యల వరకు ప్రతీ విషయాన్ని హుందాగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎప్పటికప్పుడు కేడర్ ను అప్రమత్తం చేస్తూ పార్టీని అభివృద్ధి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకున్నా కీలకంగా మారే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు.

    Also Read: Political Survey Report in AP: సర్వేల నగ్న సత్యాలు.. గ్రౌండ్ రియాలిటీలో వైసీపీ పరిస్థితి ఇదా?

    కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఆ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదు. అయినా బీజేపీతో పొత్తు ఉంటుందని పవన్ ప్రకటించారు. ఇక ఎన్నికల సమయానికి టీడీపీ అలయన్స్ గురించి ఆలోచిస్తామని అంటున్నారు. ఎన్నికల సమయానికి ఏ పార్టీ అయినా అభ్యర్థులను ప్రకటిస్తుంది. ఈ తరుణంలో కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు టిక్కెట్ కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి వారాని పవన్ చేరదీసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అధికార వైసీపీతో పాటు ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు తమ పార్టీల్లో టికెట్ రాకపోతే జనసేన వైపు చూసే అవకాశం ఉందని అంటున్నారు.

    అటు పొలిటికల్ గా స్కెచ్ వేస్తున్న పవన్ ఇటు ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. మొన్నటి వరకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష చొప్పున సాయం అందించారు. ఇప్పుడు కైలు రైతు యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు. మరోవైపు రోడ్ల దుస్థితిపై ‘గుడ్ మార్నింగ్ సీఎం గారు’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధ్వాన్నపు రోడ్ల గురించి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దీంతో ప్రజల్లో జనసేన వైపు ఇంట్రెస్టు పెరగుతోంది. పలు పథకాల పేరిట అధికార వైసీపీ డబ్బులను ఇస్తున్నా.. అవి కొందరికే ఉపయోగకరంగా మారతున్నాయని అంటున్నారు. ఇదే అవకాశాన్ని తీసుకున్న జనసేన ప్రభుత్వం పథకాల పేరిట అప్పులకుప్ప రాష్ట్రంగా మారుస్తుందని ప్రచారం చేస్తున్నారు.

    Pawan Kalyan:

    ఇక పవన్ ప్రసంగంలోనూ చాలా మారింది. గతంలో కేవంల విమర్శలు మాత్రమే చేసిన పవన్ ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి అవసరమో లెక్కలతో సహా చెబుతున్నారు. తాను సినిమాలను కేవలం ఖర్చుల కోసమే చేస్తున్నానని, కొన్ని రోజుల తరువాత పూర్తిగా ప్రజా సేవకే అంకితమవుతానని చెబుతున్నాడు. ఏదో పార్టీ పెట్టి డబ్బులు సంపాదించుకొని వెళ్లిపోయే వ్యక్తిని కాదని, ప్రజలతోనే ఎల్లప్పుడూ కలిసి ఉంటానని చెబుతున్నాడు. ఓ వైపు వైసీపీ, టీడీపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సమయంలో జనసేన మాత్రం ప్రజా అవరసరాల గురించి మాట్లడడంతో ఆ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని అంటున్నారు.

    ఇదే ఊపుతో వచ్చే ఎన్నికల్లోకి వెళితే కచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని కేడర్ సంబరపడిపోతుంది. అయితే ఎన్నికల సమయానికి ఎన్నో మారవచ్చు. ఇప్పుడున్న పరిస్థితి అప్పుడు ఉండకపోవచ్చు. ముఖ్యంగా భీం ఫాం ఇచ్చిన అభ్యర్థులు సైతం భారీ ఆఫర్లు వస్తే ఇతర పార్టీల్లోకి జంప్ కొట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో సానుభూతితో పాటు రాజకీయంగా వ్యూహానికి మరింత పదును పెట్టే అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన నేత పవన్ కల్యాణ్ అప్పటి వరకు ఎలాంటి జనాకర్షక పథకాలు ప్రవేశపెడుతారో చూడాలి.

    Also Read:Azadi Ka Amrit Mahotsav: జాతీయ జెండాపై ‘మేడిన్ చైనా’ అని రాసుకోవాలా..? మోదీపై ఆగ్రహం

    Tags