స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో సుదూర ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులతో పాటు పర్యాటకులు, విద్యార్థులు తమతమ సొంతూళ్లకు వెళ్లవచ్చని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు వారికి ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖరాసింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందనగా కేంద్ర హోంశాఖ అంతరాష్ట్ర ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. లాక్‌డౌన్ వల్ల పలు ప్రాంతాల్లో వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు చిక్కుకుపోయారు. వాళ్లను తమ […]

Written By: Neelambaram, Updated On : April 30, 2020 1:38 pm
Follow us on


కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో సుదూర ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులతో పాటు పర్యాటకులు, విద్యార్థులు తమతమ సొంతూళ్లకు వెళ్లవచ్చని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు వారికి ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖరాసింది.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందనగా కేంద్ర హోంశాఖ అంతరాష్ట్ర ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. లాక్‌డౌన్ వల్ల పలు ప్రాంతాల్లో వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు చిక్కుకుపోయారు.

వాళ్లను తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించండి. ఇందుకోసం ప్రతి రాష్ట్రం నోడల్ అధికారులను నియమించాలి. ఎవరెవరిని పంపిస్తున్నారు? ఎవరెవరిని అనుతిస్తున్నారన్న వివరాలను నమోదు చేయాలని సూచించింది.

ఒకవేళ పక్క రాష్ట్రాలకు వెళ్లేవారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వారుంటే.. ఆయా రాష్ట్రాల పరస్పరం సంప్రదింపులు జరుపుకోవాలి. పరస్పర ఒప్పందంతో రోడ్డు మార్గంలో వారిని తరలించాలి. సొంతూళ్లకు వెళ్లే వారిని విధిగా స్క్రీనింగ్ చేయాలి. ఎటువంటి కరోనా లక్షణాలు లేకుంటేనే అనుమతించాలి.

సమూహంగా వెళ్లేవారిని బస్సుల్లో తరలించాలి. బస్సును శానిటైజ్ చేయడంతో పాటు సీటింగ్ విషయంలో సామాజిక దూరం పాటించాలి. సొంత ప్రాంతాలకు చేరుకున్న తర్వాత వారిని స్థానిక అధికారులు స్క్రీనింగ్ చేసి హోం క్వారంటైన్ చేయాలి. వారంతా ఆరోగ్యసేతు యాప్ ద్వారా నిత్యం ఆరోగ్య వివరాలను నమోదు చేయాలి.