https://oktelugu.com/

గ్రేట్.. పవన్ కళ్యాణ్ లో స్పందనలు

కరోనాతో ఏపీ అల్లకల్లోలం అయినా.. ఏపీలో ఎన్ని ఉపద్రవాలు ఘోరాలు జరిగినా.. గత మార్చి ఏప్రిల్ నుంచి జనసేనాని ఏపీ యాక్టివ్ పాలిటిక్స్ లోనే లేరు. కరోనా కారణంగా ఆయన హైదరాబాద్ కే పరిమితమయ్యారు.ఓ వైపు ప్రతిపక్షం టీడీపీ ప్రతీసారి ఏదో ఒక రచ్చ చేస్తూ వైసీపీ సర్కార్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా పవన్ మాత్రం స్పందించలేదు. ఇక బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోమువీర్రాజు కొత్తగా నియామకం అయ్యి హల్ చల్ చేస్తున్నా […]

Written By: , Updated On : September 4, 2020 / 09:12 AM IST
pawankalyan
Follow us on

pawankalyan

కరోనాతో ఏపీ అల్లకల్లోలం అయినా.. ఏపీలో ఎన్ని ఉపద్రవాలు ఘోరాలు జరిగినా.. గత మార్చి ఏప్రిల్ నుంచి జనసేనాని ఏపీ యాక్టివ్ పాలిటిక్స్ లోనే లేరు. కరోనా కారణంగా ఆయన హైదరాబాద్ కే పరిమితమయ్యారు.ఓ వైపు ప్రతిపక్షం టీడీపీ ప్రతీసారి ఏదో ఒక రచ్చ చేస్తూ వైసీపీ సర్కార్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా పవన్ మాత్రం స్పందించలేదు. ఇక బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోమువీర్రాజు కొత్తగా నియామకం అయ్యి హల్ చల్ చేస్తున్నా పవన్ ఏపీకి రాలేదు.

ఎందుకో కానీ పవన్ కరోనా వచ్చాక ఏపీ రాజకీయాల కంటే సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇప్పటికే 3 సినిమాలు అనౌన్స్ చేయగా.. నాలుగో సినిమా కూడా పట్టాలెక్కబోతోంది.

ఇలా ఐదురు నెలలుగా స్పందనలు లేని పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు స్పందనలు ఎక్కువయ్యాయన్న చర్చ జరుగుతోంది. తాజాగా సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు వచ్చింది. ఆయనకు సినీ, రాజకీయ, ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

అయితే ఇన్నాళ్లు ట్విట్టర్ ముఖం చూడని పవన్ తాజాగా బర్త్ డే సందర్భంగా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపడం విశేషం.

ఎప్పుడూ స్పందించని పవన్.. ఇలా నిన్న అంతా అందరితో టచ్ లోకి రావడం చూసి ఆఖరుకు టాలీవుడ్ కామెడీ హీరో ‘సంపూర్ణేష్ బాబు’ కు కూడా రిప్లై ఇవ్వడంతో అతడు.. ఏకంగా దాన్ని ‘ఫ్రేం కట్టుకుంటా భయ్యా.. నువ్వు నాకు రిప్లై ఇచ్చావా’ అని ఆశ్చర్యపోయాడు.. ఇలా పవన్ నిశ్శబ్ధం కూడా ఇంత ప్రశాంతంగా ఉంటుందని.. అతడి స్పందనలు అందరికీ హాయిని  ఇస్తాయని అందరికీ అర్థమైంది..

-నరేశ్.ఎ