Homeజాతీయ వార్తలుPrivatisation of banks: దేశ ప్రజలపై ‘బ్యాంకింగ్’ బాంబ్ వేస్తోన్న మోడీ.. బతికేదెట్లా?

Privatisation of banks: దేశ ప్రజలపై ‘బ్యాంకింగ్’ బాంబ్ వేస్తోన్న మోడీ.. బతికేదెట్లా?

Privatisation of banks: నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అవుతోంది. వరుసగా మూడుసార్లు మోదీ ప్రధని అయ్యారు. ఈ కాలంలో చెబుకోదగిన సంస్కరణలు, నిర్ణయాలు, అంతర్జాతీయ గుర్తింపు సాధించినా.. వాటి ప్రభావం సమాజంలోని ప్రతి వర్గంపై సమానంగా ఉందా అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. జీఎస్టీ, రామాలయం, కశ్మీర్‌ ఏకీకరణ వంటి రాజకీయ సైనిక విజయాలతోపాటు, ఆర్థిక రంగంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రం మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి.

నోట్ల రద్దుతో ఆర్థిక విఘాతం..
2016లో చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయంతో ప్రభుత్వం నల్లధనం నిర్మూలన, పారదర్శక లావాదేవీల లక్ష్యాలను ముందుకు తెచ్చింది. కానీ వాస్తవ ఫలితాలు అందుకోకుండా, చిన్న వ్యాపారులు, గ్రామీణ వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆర్థిక నిపుణుల దృష్టిలో ఇది ‘‘ప్రణాళిక కంటే ప్రభావం ఎక్కువ’’ అనే ఉదాహరణగా నిలిచింది.

అభివృద్ధి ఉన్నా.. అసమానత
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగడం ఒక విజయం. కానీ, ఆదాయం పంపిణీలో అసమానతలు, మధ్యతరగతి వృద్ధి మందగించడం, పేదలలో వినియోగ శక్తి తగ్గిపోవడం వంటి అంశాలు ఆర్థిక సమతౌల్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణయం మరింత చర్చనీయాంశమైంది.

బ్యాంకుల ప్రైవేటీకరణ..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే ఆలోచనను వెల్లడించారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు సూచనగా మారింది. ఇందిరాగాంధీ నాడు జాతీయీకరణ చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్‌ చేరువైంది. పేద రైతులు, చిన్న వ్యాపారులు మొదటిసారిగా రుణాలు పొందే అవకాశం పొందారు. ఇప్పుడీ వ్యవస్థ తిరిగి ప్రైవేటు చేతుల్లోకి వెళితే ఆ వర్గాలు మళ్లీ దూరమయ్యే ప్రమాదం ఉంది. 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయీకరణ చేశారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు కూడా బ్యాంకులకు వెళ్తున్నారు. ప్రైవేటీకరణ జరిగితే ఫైనాన్స్‌ సంస్థలా మారిపోతాయి.

ప్రైవేట్‌కు ప్రయోజనం.. ప్రజలకు నష్టం
నేటి ప్రైవేటు బ్యాంకులు ఆధునిక సాంకేతికత, వేగవంతమైన సేవల్లో ముందువరసలో ఉన్నా, ప్రజల మౌలిక అవసరాలను తీర్చడంలో ఆ చిత్తశుద్ధి కనిపించడం లేదు. వడ్డీ భారాలు, రికవరీ ఒత్తిడి, పట్టణ పరిధిలో మాత్రమే ఉన్న శ్రేణి. ఇవన్నీ సామాన్యులకు దూరం చేస్తున్నాయి. జాతీయీకరణతో గ్రామీణ భారతం బ్యాంకింగ్‌కు చేరువైన విధంగానే, ప్రైవేటీకరణతో మళ్లీ అది వెనుతిరిగే ప్రమాదం ఉంది.

ప్రభుత్వ ఆస్తుల విక్రయం..
ప్రధానమంత్రిగా మోదీ తీసుకుంటున్న నిర్ణయాల్లో పరిశ్రమల విక్రయం, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వరుసగా సాగుతోంది. మొదట నష్టాల్లో ఉన్న సంస్థలను అమ్మిన ప్రభుత్వం, ఇప్పుడు లాభదాయక రంగాలనూ అప్పగిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్‌ఐసీ, రైల్వేలు, నౌకాయాన, ఎయిర్‌ ఇండియా తర్వాత ఇప్పుడు బ్యాంకులు కూడా ప్రైవేటు జాబితాలో చేరడం ఆందోళన కలిగించే పరిణామం. ప్రైవేటీకరణ అమలు అయితే దేశ ఆర్థిక దిశ పూర్తిగా మారవచ్చు. బ్యాంకింగ్‌ సేవలు లాభ పోకడల దిశగా నడుస్తే సామాజిక భద్రతా మెకానిజం సడలిపోతుంది. ఈ నేపథ్యంలో ఆర్థికవేత్తలు, ప్రజాస్వామ్య వాదులు ప్రభుత్వాన్ని జాగ్రత్తగా అడుగులు వేయాలని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రజలు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆస్తులపై ప్రజల హక్కు కొనసాగాలంటే, వాటిపై ప్రజల స్వరమే బలంగా వినిపించాలని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది కేవలం పాలనా నిర్ణయం కాదు.. భారత ఆర్థిక ప్రజాస్వామ్య భవిష్యత్తు నిర్ణయించే కీలక మలుపు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular