కరోనాతో పోరాడుతున్న సిబ్బందికి రూ. 50 లక్షల బీమా

కొవిడ్-19 వైరస్ తో పోరాడుతున్న ఆరోగ్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా వర్తింపచేస్తున్నట్లు రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవాహరెడ్డి తెలిపారు. ఈ భీమా 90 రోజులకు వర్తిస్తుందన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద బీమా చెల్లించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వైద్యులు మొదలుకొని వర్కర్లందరికీ బీమా పథకం వర్తిస్తుందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు , ఎయిమ్స్, సిజిహెచ్ఎస్ ,కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కీ వర్తింపు చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ విపత్తు […]

Written By: Neelambaram, Updated On : March 30, 2020 12:06 pm
Follow us on

కొవిడ్-19 వైరస్ తో పోరాడుతున్న ఆరోగ్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా వర్తింపచేస్తున్నట్లు రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవాహరెడ్డి తెలిపారు. ఈ భీమా 90 రోజులకు వర్తిస్తుందన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద బీమా చెల్లించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వైద్యులు మొదలుకొని వర్కర్లందరికీ బీమా పథకం వర్తిస్తుందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు , ఎయిమ్స్, సిజిహెచ్ఎస్ ,కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కీ వర్తింపు చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ విపత్తు నివారణా నిధి (ఏన్డీఆర్ఎఫ్) నుండి బీమా సొమ్మును చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటికే బీమా పాలసీలు ఉన్నవారికీ వర్తిస్తుందన్నారు.

ఇతర బీమా పథకాలకంటే ఎక్కువగా కవరేజీ ఈ బీమా పథకం ప్రత్యేకతగా చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారికి వైద్యులు, ఇతర సిబ్బంది ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. సమయాన్ని సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నారు. వీరి సేవలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ బీమా పధకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో పనిచేస్తున్న వైద్యులు, పారమెడికల్ సిబ్బంది ఈ పధకాన్ని అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.