ఆఖరకు ఎయిర్ పోర్టులను కూడా వదలవా మోడీ సార్..?

నాలుగైదు వ్యూహాత్మక రంగాలు తప్ప.. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తామని ఇప్పటికే ప్రధాని మోడీ సర్కార్‌‌ ప్రకటించేసింది. అయితే.. ఆ ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకెళుతోంది. ఏ శాఖలో ఏ మేరకు ఆస్తులు అమ్మాలనే వివరాలు సిద్ధంకాగా, ఆ మేరకు నీతి ఆయోగ్ టార్గెట్లను కూడా నిర్ధారించింది. రైల్వే శాఖకు అత్యధికంగా రూ.90 వేల కోట్ల టార్గెట్ విధించగా, టెలికాం శాఖలో రూ.40 వేల కోట్ల ఆస్తుల్ని విక్రయించనున్నారు. అదే […]

Written By: Srinivas, Updated On : March 15, 2021 2:36 pm
Follow us on


నాలుగైదు వ్యూహాత్మక రంగాలు తప్ప.. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తామని ఇప్పటికే ప్రధాని మోడీ సర్కార్‌‌ ప్రకటించేసింది. అయితే.. ఆ ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకెళుతోంది. ఏ శాఖలో ఏ మేరకు ఆస్తులు అమ్మాలనే వివరాలు సిద్ధంకాగా, ఆ మేరకు నీతి ఆయోగ్ టార్గెట్లను కూడా నిర్ధారించింది. రైల్వే శాఖకు అత్యధికంగా రూ.90 వేల కోట్ల టార్గెట్ విధించగా, టెలికాం శాఖలో రూ.40 వేల కోట్ల ఆస్తుల్ని విక్రయించనున్నారు. అదే క్రమంలో రోడ్లు, హైవేల శాఖకు రూ.30 వేల కోట్లు, విద్యుత్ శాఖకు రూ.27వేల కోట్లు, విమానయానంలో రూ.20 వేల కోట్లు, క్రీడా శాఖలో రూ.20 వేల కోట్లు, పెట్రోలియం 17 వేల కోట్లు, పోర్టులు షిప్పింగ్ శాఖకు రూ.4 వేల కోట్ల టార్గెట్ విధించారు.

Also Read: విద్యుత్ రంగంలో తెలంగాణ అద్భుత విజయాలు

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఎండియా, బీఎస్ఎన్ఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తోపాటు మరెన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నట్టు ప్రకటించగా.. తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వాటాలు కలిగిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడంతోపాటు ఇప్పటికే ఆయా సంస్థల్లో ప్రభుత్వానికి ఉన్న వాటాలను విక్రయించడం ద్వారా మొత్తం రూ.2.5 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించడం తెలిసిందే.

విమానాశ్రయాల అమ్మకం విషయంలో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు లాభాల్లో ఉన్న, అంతగా లాభాల్లో లేని విమానాశ్రయాలను కలిపి విక్రయించనున్నారు. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఏఏఐ దేశవ్యాప్తంగా 100కుపైగా విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. కాగా.. ముంబై విమానాశ్రయంలో అదానీ గ్రూప్‌నకు 74 శాతం వాటా ఉంది. మిగతా 26 శాతం వాటా ఏఏఐ సొంతం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీఎంఆర్ గ్రూపునకు 54 శాతం వాటా ఉండగా, ఏఏఐకి 26 శాతం, ఫ్రాపోర్ట్ ఏజీ అండ్ ఎరామన్ మలేసియాకు 10 శాతం వాటా ఉంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విషయానికి వస్తే ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉండగా, బెంగళూరులోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. వీటన్నింటిలో కేంద్రం తన వాటాలను అమ్మేయనుంది. తద్వారా ఈ ఎయిర్ పోర్టులు పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి.

Also Read: ఆ సీటుపై వకీల్‌ సాబ్‌ సంజాయిషీ

ఎయిర్‌‌ పోర్టుల ప్రైవేటీకరణకు సంబంధించి తొలి దశలో లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల కాంట్రాక్ట్‌లను అదానీ గ్రూప్ ఇప్పటికే దక్కించుకుంది. 2020–-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం గుర్తించగా అందులో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లోని ఏఏఐ వాటాలను అమ్మేయాలని నిర్ణయించినట్టు సంబంధిత శాఖకు చెందిన కీలక వ్యక్తులు వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్