https://oktelugu.com/

Telangana Governor: తెలంగాణకు కొత్త గవర్నర్‌..!?.. ఎవరికి ఛాన్స్ అంటే?

Telangana Governor: తెలంగాణకు కొత్త గవర్నర్‌ రాబోతున్నారా.? కొత్తగా ఎవరికి అవకాశం దక్కనుంది. తెలంగాణ ప్రభుత్వం తనను అవమానిస్తోందని, విపక్షాలతో పోరాడాల్సిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనను టార్గెట్‌ చేస్తోందని ఢిల్లీ పర్యటనల్లో గవర్నర్‌ తమిళసై సౌందర్యరాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే తెలంగాణకు కొత్త గవర్నర్‌ను పంపాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ పొలిటికల్‌ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో సుమారు ఏడాదిగా ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ మధ్య దూరం పెరుగుతోంది. ఇటీవల ఇది మరింత ఎక్కువైంది. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 19, 2022 / 05:17 PM IST
    Follow us on

    Telangana Governor: తెలంగాణకు కొత్త గవర్నర్‌ రాబోతున్నారా.? కొత్తగా ఎవరికి అవకాశం దక్కనుంది. తెలంగాణ ప్రభుత్వం తనను అవమానిస్తోందని, విపక్షాలతో పోరాడాల్సిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనను టార్గెట్‌ చేస్తోందని ఢిల్లీ పర్యటనల్లో గవర్నర్‌ తమిళసై సౌందర్యరాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే తెలంగాణకు కొత్త గవర్నర్‌ను పంపాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు ఢిల్లీ పొలిటికల్‌ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

    tamilisai

    తెలంగాణలో సుమారు ఏడాదిగా ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ మధ్య దూరం పెరుగుతోంది. ఇటీవల ఇది మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో ఉగాది పండుగ తర్వాత ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ తమిళిపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. ఆ సమయంలో తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. తనను అవమానించే విధంగా వ్యవహరించారంటూ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు కారణమయ్యాయి. ఇదే సమయంలో గవర్నర్‌ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో కొందరు మంత్రులు స్పందించారు. గవర్నర్‌ వ్యాఖ్యలను తప్పు బట్టారు. ఎక్కడ అవమానం జరిగిందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ వ్యవస్థ అవసరం లేదనే స్థాయిలో వ్యాఖ్యలు వినిపించాయి.

    Also Read: CM Kcr- Prashant Kishor: ‘పీకే’ అడుగులు.. కేసీఆర్ గుట్టు కాంగ్రెస్ చేతికి?

    -రాజ్యాంగ వ్యవస్థకే అవమానం..
    తెలంగాణలో తన పర్యటనల సమయంలో ప్రోటోకాల్‌ పాటించటం లేదని గవర్నర్‌ ఢిల్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ఇది తనకు వ్యక్తిగతంగా జరుగుతున్న అవమానం కాదని..రాజ్‌ భవన్‌ కు జరగుతున్న అవమానంగా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో పది రోజుల వ్యవధిలో గవర్నర్‌ సోమవారం మళ్లీ ఢిల్లీ వెళ్లారు. తాజాగా.. ఢిల్లీ పర్యటనలో గవర్నర్‌ తనకు తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలని కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ మార్పుకు సుముఖంగా లేరనే వాదన బలంగా వినిపిస్తోంది.

    -పాత వీడియోల ట్రోలింగ్‌పై ఫిర్యాదు..
    పాత వీడియో క్లిప్పంగులతో టీఆర్‌ఎస్‌ నాయకులు తన పైన దుష్ప్రచారం చేస్తున్నారనే అంశాన్ని గవర్నర్‌ తమిళిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈమేరకు ఢిల్లీలో ఆమె చేపిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. తాను బలహీనురాలును కాదని బలవంతురాలినని, మహిళలంతా బలవంతులుగా ఉండాలని సూచిస్తున్న గవర్నర్‌ తమిళిసై.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే వ్యూహంపైనా నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజకీయంగానూ తెలంగాణ అధికార పార్టీ వర్సెస్‌ కేంద్రం అన్నట్లుగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా తెలంగాణలో అమలు చేయాల్సిన యాక్షన్‌ ప్లాన్‌ గురించి కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందులో బీజేపీ నుంచి కౌంటర్‌గా రాజకీయ వ్యూహాలు అమలు చేసే దిశగా త్వరలోనే కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, గవర్నర్‌ మార్పుకు సంబంధించి కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతుంది.

    tamilisai

    -కొత్తగా చాన్స్ దక్కేదెవరికి?
    తెలంగాణ గవర్నర తమిళిసైని బదిలీ చేయాల్సి వస్తే.. ప్రత్యామ్నాయంగా ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపైనా అధికార వర్గాలు ముందస్తుగానే కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తమిళిసైని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా పూర్తిస్థాయిలో కొనసాగించినా అక్కడ విపక్షాలు కూడా ఆమెపై విమర్శలు చేసే అవకాశం ఉంది. తాజాగా తమిళ సంవత్సరాది సందర్భంగా గవర్నర్‌ నిర్వహించిన విందు కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశాయి. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పరిగణలోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌ తమిళిసై తాజాగా అందజేసిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ ప్రస్తుత గవర్నర్‌ను మారిస్తే.. ఆ స్థానంలో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్ కర్, కర్నాటక గవర్నర్‌ తవర్‌ చంద్‌ గెహ్లాట్, మహారాష్ట్ర గవర్న్‌ భగత్‌సింగ్‌ కోషియారి, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్ .రవిలో ఒకరిని తెలంగాణకు బదిలీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

    Also Read: Prashant Kishor: కాంగ్రెస్ లోకి పీకే ఎంట్రీ ఖాయ‌మైన‌ట్టేనా.. అప్పుడే భగ్గుమంటున్న సీనియ‌ర్లు..
    Recommended Videos

    Tags