Homeజాతీయ వార్తలుPolitics and Governance: ఎన్నికల్లో గెలుపే పరమావధి.. ప్రజలను రోడ్డుకీడుస్తున్న పాలనా రాజకీయం...!

Politics and Governance: ఎన్నికల్లో గెలుపే పరమావధి.. ప్రజలను రోడ్డుకీడుస్తున్న పాలనా రాజకీయం…!

Politics and Governance: భారత రాజ్యంగం ప్రకారం..రాజ్యం శ్రేయో రాజ్య భావనను కలిగి ఉండాలి. అనగా ఆ రాజ్యంలోని ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు వారికి మెరుగైన జీవనం అందించేందుకుగాను చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతున్నది. కానీ, నిజానికి ప్రతీ వర్గంలోనూ ఏదో ఒక్క ఆందోళన ఉందన్న వాదన వినబడుతోంది.

Politics and Governance
Politics and Governance

ప్రభుత్వాలు ప్రజలను పక్కనబెట్టి తమ రాజకీయంపైన మెయిన్ ఫోకస్ చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. నిజానికి క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఆ దిశగానే ప్రభుత్వాలు పని చేస్తున్నాయని అనిపిస్తోందని పలువురు అంటున్నారు కూడా. ప్రజలను వీలైనంత ఎక్కువ కష్టాల పాలు చేసి ఎన్నికల టైంలోనే కావాల్సినంత సాయం చేసి, ఓట్లు పొందాలని భావిస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు.

Also Read: తెలుగుతనం ఉట్టిపడేలా పంచెకట్టులో జగన్.. భోగి సంబురాల్లో ఏపీ సీఎం..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ఉన్న సమస్యల్లో కొన్నిటినీ పరిశీలిద్దాం. తెలంగాణలో ఉద్యోగులకు ఒక రకమైన బాధ ఉంటే, ఏపీలోని ఉద్యోగులకు మరొక రకమైన బాధ ఉంది. ఇటీవల తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన 317 జీవోను వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగులు. ఈ క్రమంలోనే గత వారం రోజుల్లో పది మంది ఉద్యోగులు చనిపోయారు కూడా. అయితే, ఈ జీవోను పున:సమీక్షించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు కూడా కోరుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం సరైన రీతిలో స్పందించడం లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది.

ఇక ఏపీలో ఉద్యోగులు తమకు వేతనాలు తగ్గించొద్దని వేడుకుంటున్నారు. ఇటీవల పీఆర్సీ ప్రకటించారు. కానీ, ఆ పీఆర్సీతో జీవో అయితే రాలేదు. హెచ్ఆర్ ఏ తగ్గించడం వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు ఉద్యోగులు. మరో వైపున ఓటీఎస్ లక్ష్యాలతో ప్రభుత్వ ఉద్యోగులు, కమిషనర్లు ఆగమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల్లో రైతుల సమస్యలపైన కూడా ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయనే విమర్శలున్నాయి. రైతు బంధు, రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం చేస్తున్న ప్రభుత్వాలు ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో విఫలమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల కొనుగోలు శక్తి పెంచడంతో పాటు ఉపాధి కల్పనకు సరైన దిశలో చర్యలు తీసుకోవడం లేదని కొందరు విమర్శిస్తున్నారు.

Also Read:  బన్నీని టచ్ చేయడం పవన్ కి కూడా కష్టమే… కానీ చరణ్ కి కాదు!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular