
రాజధాని తరలింపు విషయంలో హై కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్ఢీఏ రద్దు బిల్లులు ఇప్పడు చట్ట రూపంలోకి వచ్చాయని, ఈ రెండు చట్టాలు అమలులో ఉన్నందున రాజధాని తరలింపుపై అభ్యంతరాలు సబబు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పిటీషన్ లోని అంశాల ఆధారం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటీషన్ పలు అంశాలను ప్రస్తావించింది. కేంద్రం రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని చెప్పిన విషయం విధితమే. ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని పదే పదే కోరుతున్నట్లు పేర్కొన్నారు.
Also Read: ఈశ్వరయ్య వ్యవహారంతో ప్రభుత్వానికి చిక్కులు తప్పవా?
రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని తెలియజేసింది. రాజధాని పూర్తిగా విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని స్సష్టం చేసిందని తన కౌంటర్ లో పేర్కొంది. ఈ కౌంటర్ పిటీషన్ ను పురపాలక శాఖ పత్యేక కార్యదర్శి వి.రామమనోహరరావు దాఖలు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన పి.శ్రీనివాసరావు 2018లో ప్రత్యేక హోదా విషయంపై పిటీషన్ దాఖలు చేశారు. అనంతరం దీనికి అనుబందంగా పునర్యవస్థీకరణ చట్టం అమలు, రాజధాని తరలింపు తదితర అంశాలపై పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. వీటిని హై కోర్టు విచారించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
Also Read: చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?
విచారణలో భాగంగా గత నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రోజుతో మధ్యంతర ఉత్తర్వుల గడువు ముగిసింది. కేసు తదుపరి విచారణ హై కోర్టు త్రి సభ్య ధర్మాసనం ఈ రోజు చేపట్టనుంది. దీంతో కోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రాజధాని తరలింపునకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుటుంది. మూడు రాజధానుల నిర్మణానికి అవసరమైన రూ.5,099 కోట్లు అవసరం అవుతాయని, ఈ నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాధనలు పంపింది. రాజధాని తరలించినా ఇక్కడి రైతులకు ఎటువంటి నష్టం ఉండదని ప్రభుత్వం తన కౌంటర్ లో పేర్కొంది. భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కోర్టుకు తెలిపారు.