విశాఖతో దానిని కలుపుతారంట

ప్రస్తుతం జగన్‌ ఫోకస్‌ అంతా కూడా కంప్లీట్‌గా విశాఖ మీదనే ఉన్నట్లుగా అర్థమవుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ కూడా విశాఖ మీదనే రివ్యూలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జగన్‌ అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిని కాదని.. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖ సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం కార్యాచరణకు రూపకల్పన చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్న భోగాపురం నుంచి విశాఖ దాకా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రెండింటి మధ్య ప్రధాన రహదాని […]

Written By: Srinivas, Updated On : April 10, 2021 2:31 pm
Follow us on


ప్రస్తుతం జగన్‌ ఫోకస్‌ అంతా కూడా కంప్లీట్‌గా విశాఖ మీదనే ఉన్నట్లుగా అర్థమవుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ కూడా విశాఖ మీదనే రివ్యూలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జగన్‌ అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిని కాదని.. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాఖ సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం కార్యాచరణకు రూపకల్పన చేసింది.

అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్న భోగాపురం నుంచి విశాఖ దాకా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రెండింటి మధ్య ప్రధాన రహదాని నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బైపాస్ రోడ్లు, మెట్రో ట్రామ్ వ్యవస్థలతో అద్భుతమైన ప్రణాళికలను కూడా రూపకల్పన చేస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురానికి యాభై కిలోమీటర్ల దూరం ఉంది.

అయితే.. ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ అభివృద్ధి పనులు చేపడితే రానున్న రోజుల్లో విశాఖ మరింతగా ప్రగతిపథంలో సాగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ మేరకు తగిన కార్యాచరణతో సిద్ధం కావాలని తాజా సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇంకా ఎటూ తేల్చకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించే యోచనలో ఉంది. మే 6 నాటికి విశాఖ నుంచే కార్యకలాపాలు సాగేలా ముహూర్తం నిర్ణయించినట్లు ఇదివరకే లీకులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖ తరలించే అవకాశం ఉందని ప్రకటించారు. అంటే.. ఇప్పటికే విశాఖలో దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రభుత్వం మొదలుపెట్టి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది.