Homeఎంటర్టైన్మెంట్'వకీల్ సాబ్'ను డీఫేమ్ చేసే కుట్రః హీరోయిన్ సంచలనం

‘వకీల్ సాబ్’ను డీఫేమ్ చేసే కుట్రః హీరోయిన్ సంచలనం

Vakeel Saab
ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వ‌కీల్ సాబ్.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ముందెన్న‌డూ లేని విధంగా క‌లెక్ష‌న్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. అయితే.. ఈ సినిమా ప్ర‌భంజ‌నాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశ‌పూర్వ‌కంగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వ‌కీల్ సాబ్ విడుద‌ల ముందు రోజు వ‌ర‌కూ సైలెంట్ గా ఉన్న ఏపీ స‌ర్కారు.. ఉన్న‌ఫ‌ళంగా సినిమా టిక్కెట్ల విష‌యం గుర్తుకు వ‌చ్చింది. దీంతో.. రాత్రికి రాత్రే సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు ఎంత ఉండాలో నిర్ణ‌యిస్తూ జీవో కూడా జారీచేసింది. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌ల క‌న్నా.. ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోవ‌ద్దంటూ ఆ జీవోలో ఆదేశించింది. ఈ నిర్ణ‌యం.. వ‌కీల్ సాబ్ మేక‌ర్స్, డిస్ట్రిబ్యూట‌ర్స్ తోపాటు సినిమా ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు పెద్ద షాకే ఇచ్చింది.

స‌హ‌జంగా పెద్ద హీరోల చిత్రాలు ఏవి రిలీజ్ అయినా.. బెనిఫిట్ షోలు వేయ‌డం స‌ర్వ సాధార‌ణం. మొద‌టి వారం పాటు టికెట్ రేట్లు పెంచుకోవ‌డం కూడా ఎప్పుడూ జ‌రిగేదే. ఈ మేర‌కు ప్ర‌భుత్వాలే జీవో ఇచ్చాయి. కానీ.. జ‌గ‌న్ స‌ర్కారు ఉన్న‌ట్టుండి రేట్లు ఇంతే ఉండాలంటూ జీవో జారీచేయ‌డం ప‌వ‌న్ అభిమానులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. క‌నీసం బెనిఫిట్ షోల‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌ని ప్ర‌భుత్వం.. టికెట్ రేట్లు కూడా పెంచ‌డానికి వీళ్లేద‌ని ప్ర‌క‌టించింది.

ఇదిలాఉంటే.. సోష‌ల్‌మీడియాలో ప‌నిగ‌ట్టుకొని వ‌కీల్ సాబ్ వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపై సినీన‌టి పూన‌మ్ కౌర్ ట్విట‌ర్ వేదికగా స్పందించారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న‌ సినిమాలు ఎవ‌రు చేసినా ఎంక‌రేజ్ చేయాలి. కానీ.. డీ ఫేమింగ్ ఆర్గ‌నైజ్డ్ ట్రెండ్ ఏంటో? ఇప్పుడు ఎవ‌రు చేస్తున్నారు కుళ్లు రాజ‌కీయాలు? అమ్మాయిల‌ను డీఫేమ్ చేసి రాజ‌కీయం చేస్తే త‌ప్పు కాదు. అమ్మాయిల‌ను ర‌క్షించే సినిమా తీస్తే ప్రాబ్ల‌మ్ ఎవ‌రికి? పోసానిగారు ప్రెస్ మీట్..?’’ అంటూ పోసాని కృష్ణ ముర‌ళిని ప్ర‌శ్నించారు పూన‌మ్ కౌర్.

ఇప్పుడు.. పూన‌మ్ వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో, సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఓ వైపు ప‌వ‌న్ ను ఉద్దేశ‌పూర్వ‌కంగానే ప్ర‌భుత్వం టార్గెట్ చేసింద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రో సోష‌ల్ మీడియాలో నెగెటివ్ ట్రోలింగ్ జ‌రుగుతోంది. పోసాని ప్రెస్‌మీట్ కూడా నెగెటివ్ గా ఉందంటూ పూన‌మ్ వ్యాఖ్యానించ‌డంతో.. ప‌వ‌న్ ను కొంద‌రు టార్గెట్ చేస్తున్న విధానం అర్థ‌మ‌వుతోంద‌ని అంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version