spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Govt Employees: గొడౌన్స్ ల్లో ఉద్యోగులు.. వైసీపీ ఆఫీసులకు కాస్ట్ లీ ప్లేస్ లు.....

AP Govt Employees: గొడౌన్స్ ల్లో ఉద్యోగులు.. వైసీపీ ఆఫీసులకు కాస్ట్ లీ ప్లేస్ లు.. ఇది జగన్ సార్ పాలన

AP Govt Employees: అయిన వారికి ఆకులో.. కానివారికి కంచంలో అన్నం పెట్టినట్టుంది ఏపీలో వైసీపీ సర్కారు దుస్థితి. ఉద్యోగులు, ఉపాధ్యాయులంటేనే ప్రభుత్వానికి గిట్టడం లేదు. వారికి రావాల్సిన అలవెన్స్ లు, రాయితీలు అందించడం లేదు. ఇప్పుడు ఏకంగా జీతాలే అందించడం లేదు. జీతాలు ఇవ్వండి మహా ప్రభో అంటూ వారు రోడ్లెక్కాల్సిన దుస్థితి. న్యాయస్థానాన్ని ఆశ్రయించి జీతాలు దక్కించుకోవాల్సిన దౌర్భగ్య స్థితి ఏపీలో ఉంది. జిల్లాలను విడగొట్టి దాదాపు ఏడాది సమీపిస్తోంది. 13 జిల్లాను కాస్తా 26 జిల్లాలుగా మార్చేశారు. పాలనా సౌలభ్యానికి అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. అయితే పాలన అందించాల్సిన ఉద్యోగులు, సిబ్బందికి మాత్రం సరైన కార్యాలయాలు ఏర్పాటుచేయలేదు. వసతులు కల్పించలేదు. చిన్నిచిన్న గొడౌన్ లో సర్ధుబాటు చేశారు. ఇప్పటికీ వాటిలోనే అవి కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు. కనీసం శాశ్వత భవనాల నిర్మాణం పై దృష్టిపెట్టలేదు. కనీసం వాటికి భూములు కూడా సేకరించలేదు. కానీ వైసీపీ కార్యాలయాలకు మాత్రం భూములు కేటాయించుకుంటున్నారు. నిర్మాణాలు కూడా చేసుకుంటున్నారు.

AP Govt Employees
AP Govt Employees

దాదాపు కొత్త జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల ఏర్పాటుకు హైకమాండ్ నిర్ణయించుకుంది. రిచ్ గా ఏర్పాటుచేయాలని భావిస్తోంది. వెయ్యి,.రెండు వేలకు ఎకరాల కొలదీ భూమిని లీజుకు తీసుకుంంది. యంత్రాంగం కూడా దీనికి బాగానే సహకరిస్తోంది. చివరకు ప్రజా రవాణకు చెందిన ఆర్టీసీ భూములను సైతం కేటాయిస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. పార్టీ ఆఫీసులకు భూముల కేటాయింపులో ప్రభుత్వం ఇష్జారాజ్యంగా వ్యవహహరిస్తోంది. అధికారులు కనీస నిబంధనలు పాటించడం లేదు. వందల కోట్ల రూపాయల భూములను వైసీపీ పరం చేస్తున్నారు. కొత్త జిల్లాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు. ఏదో పేపర్ల మీద పేర్లు రాసినట్టు ఉమ్మడి జిల్లాలను అడ్డగోలుగా విభజించారు. అవసరాల కోసం పేర్లు పెట్టి వదిలేశారు. దీంతో గోదాములు, ఇరుకుగా ఉన్న భవనాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వహించాల్సిన పరిస్థితి.

ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. అదే ఉంటే ముందుగా ప్రభుత్వ కార్యాలయాలను పూర్తిచేయాలి. కానీ అలా కాకుండా ప్రజలు తమకు అంతులేని విజయం అందించారు కదా అని ప్రజలు కట్టే పన్నులు, ప్రభుత్వ ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇష్టరాజ్యంగా ఖర్చుపెడుతున్నారు. ఎడాపెడా అన్నింటికీ వాడేస్తున్నారు. ప్రభుత్వ భూములను తమకు ఇష్టమొచ్చినట్టు తాకట్టు పెడుతున్నారు. అమ్మకాలు చేస్తున్నారు.

 

ఇప్పుడు భూములను వైసీపీ పార్టీ కార్యాలయాలకు కట్టబెడుతున్నారు. జగన్ వ్యాపారసంస్థలకు ఆయాచిత లబ్ధి చేకూర్చుతున్నారు. మీరు ఎలా ఉంటే మాకెందుకు మా పార్టీ పది కాలాల పాటు ఉండాలంటే కార్యాలయాలు ఉండాలి కదా? అని వితండవాదం చేస్తున్నారు. వినాసకాలే విపరీత బుద్ధి అన్నట్టు వ్యవస్థను తమ చెప్పు చేతల్లో పెట్టి అసలు సిసలు రాజకీయాన్ని ఏపీ ప్రజలకు చూపిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Oktelugu Epaper
Exit mobile version