
ఈ భూమ్మీదున్న ప్రతీజీవి కేవలం సంతానాభివృద్ధి కోసమే శృంగారంలో పాల్గొంటుంది. అది కూడా.. సీజన్ ప్రకారమే ఆడ, మగ జీవులు కలుస్తాయి. కానీ.. కేవలం రెండు జీవులు మాత్రమే సంతానంతోపాటు ఆనందం కోసం శృంగారంలో పాల్గొంటాయి. అందులో ఒకటి డాల్ఫిన్ కాగా.. మరొకటి మనిషి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. మనిషి జీవితంలో శృంగారం ఎంత కీలకమైనదోనని!
అయితే.. శృంగారం గురించి మాట్లాడడాన్ని కూడా తప్పుగా భావించే భారత్ లో.. ఎంతో మంది తమ కోరికలను అణచుకుంటారు. పూర్తిగా చంపేసుకుంటారు కూడా. ఇక, పెళ్లి తర్వాత పిల్లలు వచ్చేంత వరకే శృంగారమని భావించే వాళ్లు కూడా ఉన్నారు. కానీ.. కొందరిలో విపరీతమైన శృంగార కోరికలు ఉంటాయి. నడి వయసు వచ్చిన తర్వాత కూడా వారి కోరికలు గుర్రాలై పరుగు తీస్తుంటాయి. మరి, అలాంటి వారి పరిస్థితి ఏంటీ? ఒంటరిగా ఉండే వారి పరిస్థితి ఏంటీ? అన్నప్పుడు.. అలాంటి వారికోసం ఫారెన్ కంట్రీస్ లో పుట్టుకొచ్చినవే షుగర్ డాడీ యాప్స్.
సింపుల్ గా చెప్పాలంటే.. వయసు మళ్లిన మగాళ్లు, వయసులో ఉన్న అమ్మాయిలతో డేటింగ్ చేసేందుకు వేదికైనవే షుగర్ డాడీ యాప్స్. అయితే.. ఇలాంటి యాప్స్ ద్వారా.. కలుసుకునేవారు కేవలం ఫ్రెండ్షిప్ తోనే ఆగిపోతారని అనుకోవడం అమాయకత్వం అవుతుంది. ఇలా కలుసుకున్న ఆడ-మగ అంతిమ గమ్యం శృంగారమే అవుతుంది. గూగుల్ సంస్థ కూడా ఇదే చెబుతోంది. కాబట్టి.. గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న షుగర్ డాడీ యాప్స్ ను తొలగించేందుకు సిద్ధమైంది.
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే ఈ క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెడుతున్నట్టు ప్రకటించింది. ఇలాంటి యాప్స్ అన్నీ.. శృంగార యాక్ట్ కిందకే వస్తాయని ప్రకటించిన గూగుల్.. జూన్ 29వ తేదీన ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇలాంటి యాప్స్ ద్వారా సాగించే కార్యకలాపాలు ఖచ్చితంగా వ్యభిచారం కిందకే వస్తాయని స్పష్టం చేసింది. కేవలం షుగర్ డాడీ యాప్స్ మీదనే కాకుండా.. హద్దులు దాటే డేటింగ్ యాప్స్ పైనా కత్తి వేళాడుతుందని తేల్చి చెప్పింది.
భారత్ లో ఇప్పుడిప్పుడే ఇలాంటి యాప్స్ వినియోగం పెరుగుతోంది. మన దేశంలో దాదాపు నాలుగు లక్షల మంది ‘షుగర్ డాడీలు’ ఉన్నారని అంచనా. డబ్బు బాగా ఉండీ.. శృంగార కోరికలతో రగిలిపోయే ఇలాంటి వాళ్లంతా.. అమ్మాయిల కోసం షుగర్ డాడీ యాప్స్ ను ఆశ్రయిస్తున్నారని తేలింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఇలాంటి వారు ఉన్నారు. అయితే.. క్రమశిక్షణతో వ్యవహరించేందుకు పూనుకున్న గూగుల్.. ఈ యాప్స్ పై బ్యాన్ విధిస్తోంది. అయితే.. గూగుల్ బ్యాన్ చేయొచ్చేమోగానీ.. అనధికారికంగా కొనసాగే ప్లే స్టోర్స్ ఎన్ని లేవూ..?