https://oktelugu.com/

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త… అంగన్‌వాడీల్లో భారీగా పోస్టుల భర్తీ!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరోమారు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కార్ 5,905 పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పోస్టులలో 4,007 పోస్టులు హెల్పర్ల పోస్టులు అని సమాచారం. ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల సహాయంతో ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 7, 2020 / 09:50 AM IST
    Follow us on

    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరోమారు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ సర్కార్ 5,905 పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పోస్టులలో 4,007 పోస్టులు హెల్పర్ల పోస్టులు అని సమాచారం.

    ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల సహాయంతో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. రెవిన్యూ డివిజన్ లలో ఇంటర్వ్యూలు నిర్వహించి వర్కర్లు, హెల్పర్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. 5,905 పోస్టులలో 1,468 మెయిన్ అంగన్ వాడిలో వర్కర్ల పోస్టులు, 438 మినీ అంగన్ వాడీ వర్కర్ల పోస్టులు అని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు జిల్లాల్లో పోస్టుల భర్తీ పూర్తైంది.

    మిగిలిన జిల్లాల్లో కూడా పోస్టులను భర్తీ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలైన జిల్లాల్లో అభ్యర్థుల నుంచి భారీగా స్పందన వస్తోంది. ప్రభుత్వం అంగన్ వాడీల్లో వర్కర్లకు 11,500 రూపాయలు, మినీ అంగన్ వాడీల్లో వర్కర్లకు 7,000 రూపాయలు, హెల్పర్లకు 7,000 రూపాయలు వేతనంగా చెల్లించనుంది. ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని వెల్లడించారు.

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతను 10వ తరగతిగా నిర్ణయించారు. గతేడాది ఖాళీల ఆధారంగా ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా జగన్ సర్కార్ ప్రజా సంక్షేమ పాలనకే ప్రాధాన్యత ఇస్తోందని చెబుతున్నారు.