గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సీఎం జగన్ శుభవార్త..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తీపికబురు చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు నీటి సమస్యలు తీర్చేందుకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 4800 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో 57,52,445 ఇళ్లకు నేటికీ కుళాయి కనెక్షన్లు లేవు. కుళాయి లేకపోవడంతో నీళ్ల విషయంలో వీళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జలజీవన మిషన్ స్కీమ్ లో భాగంగా జగన్ సర్కార్ ఈ […]

Written By: Navya, Updated On : October 6, 2020 3:25 pm
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తీపికబురు చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు నీటి సమస్యలు తీర్చేందుకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 4800 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో 57,52,445 ఇళ్లకు నేటికీ కుళాయి కనెక్షన్లు లేవు. కుళాయి లేకపోవడంతో నీళ్ల విషయంలో వీళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన జలజీవన మిషన్ స్కీమ్ లో భాగంగా జగన్ సర్కార్ ఈ పథకం అమలుకు సిద్ధమవుతోంది. కేంద్రం ఈ పథకం కోసం 50 శాతం నిధులను ఇవ్వనుండగా మిగిలిన 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. తొలి దశలో 32 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నుంచి అందుకు ఆమోదం లభించింది. మంచినీటి పథకాలు నిర్మితమైన చోట తొలిదశలో కుళాయి ఏర్పాట్లు జరగనున్నాయి.

తొలి దశ గ్రామాల్లో ప్రభుత్వం గతంలోనే ప్రతి వ్యక్తికి రోజుకు 43.5 లీటర్ల నుంచి 55 లీటర్ల వినియోగం కోసం మంచినీటి స్కీమ్స్ ను అమలు చేస్తోంది. 43.5 లీటర్ల కంటే తక్కువ పరిమాణం నీటి సరఫరా ఉన్నచోట్ల రెండో దశలో అధికారులు కుళాయి కనెక్షన్లు ఇస్తారు. అక్కడ మంచినీటి సామర్థ్యాన్ని పెంచిన తరువాత కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.

25.52 లక్షల కుటుంబాలకు రెండో దశలో కుళాయి కనెక్షన్లు ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పట్టణాలలా గ్రామాలను కూడా అభివృద్ధి చేసే దిశాగ జగన్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.