Homeజాతీయ వార్తలుUnion Budget 2024: పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌.. యువతకు, రైతులు, పేదలకు వరాలు..

Union Budget 2024: పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌.. యువతకు, రైతులు, పేదలకు వరాలు..

Union Budget 2024: కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను మంగళవారం(జూలై 23న) ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా ఆరోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పేద, మధ్యతరగతి, కార్మికులు, ఉద్యోగుల అనేక ఆశల నడుమ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. 8 నెలల కాలానికి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ మొత్తం విలువ రూ. 32.07 లక్షల కోట్లు

రైతులకు వరాలు..
– కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి రూ.1.52 లక్షల కోట్లు ఈ బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది.

– యువత, విద్యార్థులకు ఈ బడ్జెట్‌లో నిర్మలమ్మ భారీగా కేటాయింపులు చేశారు. విద్య, నైపుణ్య అభివృద్ధికి రూ.1..48 లక్షల క ఓట్లు కేటాయించింది. ఉన్నత చదువుల కోసం రుణాలు ఇచ్చేందుకు రూ.10 లక్షల కోట్లను కేంద్రం బడ్జెట్‌లోప్రతిపాదించింది. ఇక నాలుగు కోట్ల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటటామని తెలిపారు. నిరుద్యోగులకు మూడు పథకాలు ప్రారంభిస్తామని తెలిపారు.

– 500 పరిశ్రమల్లో యువతకు అప్రంటిస్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

– మొబైల్, పరికరాల కస్టమ్స్‌ డ్యూటీ 15 శాతం తగ్గించనున్నట్లు కేంద్రం బడ్జెట్‌లో పేర్కొంది.

– బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్‌ డ్యూటీ 6 శాతానికి తగ్గిస్తున్నట్లుల ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

– క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన మూడు రకాల మందులపై కస్టమ్స్‌ డ్యూటీ ఎత్తివేస్తున్నట్లు తెలిపారు.

– ఎక్స్‌రే మిషన్లపై జీఎస్టీ తగ్గిస్తామని తెలిపారు.

– ఈ కామర్స్‌ పై టీడీఎస్‌ 0.1 శాతం తగ్గించారు. దీంతో వ్యాపారులకు కేంద్రం పెద్ద ఊరటనిచ్చింది.

– బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ కూడా 15 శాతం తగ్గిస్తామని పేర్కొన్నారు.

స్టాంప్‌ డ్యూటీ పెంచుకునే ఛాన్స్‌..
ఇక తాజాగా ప్రవేశపెట్టిన కంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలు స్టాంప్‌ డ్యూటీ పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఈమేరకు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

ఐటీలో సమస్కరణలు..
ఇక వేతన జీవులు ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఇన్‌కమ్‌ట్యాక్స్‌(ఐటీ)పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. మధ్య తరగతికి ఊరటనిచ్చేలా ఐటీ సంస్కరణలు ఉంటాయని తెలిపారు. ఇక క్యాప్టెన్‌ గెయిన్‌ ట్యాక్స్‌ మాత్రం పెంచుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత ఇన్‌కమ్‌ట్యాక్‌ పరిమితిని ప్రస్తుతం ఉన్నదానికన్నా రూ.75 వేలు పెంచుతామని తెలిపారు. 0–3 లక్షల ఆదాయ ఉన్నవారికి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. 15 లక్షలకుపైగా ఆదాయం ఉన్నవారికి ఐటీ 30 శాతం విధించనున్నట్లుల తెలిపారు. రూ.3–7 లక్షల వరకు 5 శాతం రూ.7–10 లక్షల వారికి శాతం, రూ.10–15 లక్షల వారికి 20 శాతం పన్ను విధిస్తామని తెలిపారు.

– అర్బన్‌ హౌసింగ్‌ కోసం రూ.2.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గ్రామీణాభివృద్ధి పథకాలకు రూ.2.26 అక్షల కోటుల కేటాయించారు. కోటి ఇళ్లకు సోలార్‌ సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించారు. సోలార్‌ ప్యానెళ్లపై పన్ను తగ్గిస్తున్నట్లు తెలిపారు.

– 30 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో తెలంగాణ నుంచి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖపట్టణం, విజయవాడ మాత్రమే వచ్చే అవకాశం ఉంది.

– ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీంతో మధ్య తరగతి ప్రజలకు ఊరట లభిస్తుందని తెలిపారు.

తెలంగాణకు నిరాశ..
ఇదిలా ఉంటే.. కేంద్రం బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్‌కు భారీగా నిధులు కేటాయించింది. కానీ,. తెలంగాణకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు జరుగలేదు. అన్ని రాష్ట్రాలకు వర్తించే పథకాలే తెలంగాణకు వర్తించనున్నాయి. కానీ, తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ప్రత్యేక నిధులేవీ బడ్జెట్‌లో కేటాయింపు జరుగలేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version