Pawan Kalyan – CM : జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వెళుతున్నారు. ఆదరబాదరాగా కాకుండా పకడ్బందీ ప్లాన్ తోనే సాగుతున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఇప్పుడే తొందరపడి ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నికల చివరి సంవత్సరం యాత్ర సహా ప్రజల్లోనే ఉంటే బెటర్ అని ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఏపీలో జనసేన , టీడీపీ రెండు పార్టీలు కలిస్తే వైసీపీ ఓటమి ఖాయం. పవన్ తలుచుకున్నట్టు అధికార వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక రావద్దు. ఈ వ్యూహంతో వెళితే మాత్రం ఖచ్చితంగా జగన్ పార్టీని ఓడించవచ్చని తేలిందట..
అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్రను ఎన్నికల ముందర నిర్వహించాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. జనసేన ఒంటరిగా వెళ్లినా.. టీడీపీ కలిసి వెళ్లినా పవన్ కళ్యాణ్ యే కింగ్ మేకర్ అవుతాడని అంటున్నారు. కర్ణాటకలో కుమారస్వామిలా ఏపీలో పవన్ దాదాపు 40 సీట్లు కొట్టి టీడీపీ మద్దతుతో సీఎం కుర్చీ ఎక్కబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ పొత్తు పొడిస్తేనే పవన్ సీఎం ఆశ నెరవేరుతుంది.
కర్ణాటక రాజకీయాల్ని ఆంధ్రాకి అన్వయిస్తే.? ఎలా ఉంటుందన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..