Homeజాతీయ వార్తలుGone Prakash Rao: ఐఏఎస్ ల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది.. గొనె ప్రకాశ్...

Gone Prakash Rao: ఐఏఎస్ ల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది.. గొనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Gone Prakash Rao: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిలాబాద్ కలెక్టర్ అవనీతికి పాల్పడ్డారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గొనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఒక లేడీ కలెక్టర్ పై పరుష ధూషణలు చేశారని ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోనెప్రకాశ్ రావు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు అవినీతికి పాల్పడడానికి తగిన ఆధారాలున్నాయని, వీటిని ఎలక్షన్ కమిషన్ కు సమర్పిస్తానని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు ఆసక్తి విషయాలను పంచుకున్నారు.

Gone Prakash Rao
Gone-Prakash-Rao

‘చట్టంలో నేను అసభ్య పదాలు వాడానని అంటున్నారు. కానీ మారుమూలలో లేడీ ఆఫీసర్ పనిచేస్తున్నారు అని పేర్కొన్నారు. అయితే ఆదిలాబాద్ కలెక్టర్ ప్రవర్తన అనుమానాస్పదంగా మారింది. అందుకే అవేశంతో కొన్ని వ్యాఖ్యలు చేయొచ్చు. కానీ నేను కేసీఆర్ వాడే భాషనే మాట్లాడాను. అయితే దీనికి సంబంధించిన పుటేజీని స్వీకరిస్తున్నాను. వాటిని ఎలక్షన్ కమిషన్ కు అందిస్తాను. హైదరాబాద్, ఢిల్లీకి చెందిన ఎలక్షన్ కమిషన్లో వీటిని అందిస్తాను.’  అని గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే.. రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ వేశారు. నాతో కలిసి 25న హైదరాబాద్ కు వచ్చారు. 26వ తేదీ మార్నింగ్ ఆదిలాబాద్ కు వచ్చారు. సాయంత్రం 7 గంటల వరకు నాతోనే ఉన్నారు. మరుసటి రోజు 27న హైదరాబాద్ కు వెళ్లారు. అయితే ఈ క్రమంలో ఓ మహిళ 27న తనను ధూషించారని ఆరోపించారు. హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ఎలా ధూషిస్తారు..? తన నామినేషన్ తిరస్కరించినందుకు కలెక్టరేట్ కు వెళ్లి సర్టిఫికెట్లను అడిగారు. కానీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. నామినేషన్ తిరస్కరించిన వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వాలి కదా..అయితే సంతకం ఫోర్జరీ చేశారని అంటున్నారు. ఎలా అవుతుంది..135 కోట్ల జనాభాలో సిగ్నేచర్ టాలీ అయ్యే అవకాశం లేదు..’ అని హాట్ కామెంట్స్ చేశారు.

‘మంత్రి జోగు రామన్న అక్కడే ఉన్నారు. కానీ ఆయనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. మరోవైపు తుడుం దెబ్బకు చెందిన నాయకురాలు గేటు బయట గొడవ చేస్తోంది. ఈ సమయంలో కొందరు మీడియా మిత్రులు పోలీసులతో మాట్లాడి లోపలికి పంపించారు. ఇంతలో అన్ నౌన్ పర్సన్ చేతిలో కాగితాలు పట్టుకొని వచ్చాడు. ఇవన్నీ మీడియాలో కూడా వచ్చాయి. వాటికి సంబంధించిన ఆధారాలు నావద్దే ఉన్నాయి. ఇక అదిలాబాద్ ను మారుమూల జిల్లా అని అంటున్నారు. మహారాష్ట్రకు హైవే మధ్యలో ఉన్న ఆదిలాబాద్ మారుమూల జిల్లా ఎలా అవుతుంది..? అంతేకాకుండా 15 ఎకరాల్లో కలెక్టరేట్ భవనం ఉంది. ఇన్ని సౌకర్యాలున్న ఆదిలాబాద్ ను మారుమూల ప్రాంతం అని ఎలా చెబుతారు..?’ అని గోనె ప్రశ్నించారు.

Also Read: స్టాలిన్ ను అందుకు ఒప్పించిన కేసీఆర్?

ఇక కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యలకు ‘నేను అప్పుడే సారీ అని చెప్పానన్నారు. ఒక అధికారికి గౌరవం ఇవ్వాలి కాబట్టి క్షమాపణలు చెప్పడంలో తప్పులేదని అనుకున్నా.. కలెక్టర్ హానెస్ట్… కానీ ఆమె చేసే విధుల్లో ఇంత అయోమయం ఉండడంపై నా ఆగ్రహం..ఆమె తప్పును అధికారులు ఖండించాలి. ఈరోజుల్లో ప్రభుత్వం అధికారులు ప్రభుత్వ వాహనాన్ని తమ సొంత పనులకు వాడుకుంటున్నారు. స్కూళ్లకు, సినిమాహాళ్లకు, విహారయాత్రలకు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళతున్నారు. నేను ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులను సైతం ఆటోలో వెళ్లమని చెప్పాను. ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించలేదు. నేను చైర్మన్ అయినంత మాత్రాన అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. కార్పొరేషన్ చైర్మన్ కు అత్యున్నత అధికారం ఉంటుంది. కానీ సొంతానికి ఉపయోగించుకోలేదు. నా దగ్గర పనిచేసే అటెండర్ ను సైతం డోర్ తీయనీయలేదు’ అని గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవినీతి అధికారుల చిట్టాను బయటపెడుతానంటూ గోనె ప్రకటించి సంచలనం రేపారు. మరి అది ఎప్పుడు బయటపెడుతాడు? అందులో ఎవరెవరు ఉన్నారన్నది తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గోనె ప్రకాష్ రావు ఇంటర్వ్యూ వీడియో

Also Read: టీడీపీని గాడిలో పెట్టే వారి కోసమే బాబు ఎదురుచూపు?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular