Homeజాతీయ వార్తలుForex Reserves And Gold Imports: బంగారం మీద సుంకాన్ని పెంచితే.. ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయా..

Forex Reserves And Gold Imports: బంగారం మీద సుంకాన్ని పెంచితే.. ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయా..

Forex Reserves And Gold Imports: ముల్లును ముల్లుతోనే తీయాలి. ముల్లు గుచ్చుకుంటే దానిని గునపంతో తీస్తే ప్రాణాలు పోతాయి. ఆర్థిక నిపుణులు ఒక దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు.. దేశ పాలకులు సంబంధంలేని విధానాలకు కొనసాగిస్తే.. ఈ ఉపోద్ఘాతాన్ని వాడుతుంటారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఇదే పరిస్థితి ఉందా అంటే.. ఉందని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.

బంగారం దిగుమతి కోసం భారత్ అధికంగా విదేశీ మారకద్రవ్య నిల్వలను ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీనివల్ల ఫారెక్స్ నిలువలు వేగంగా కరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు కూడా ఏమాత్రం బాగోలేదు. మధ్య ఆసియా ప్రాంతంలో యుద్ధం తగ్గే అవకాశం కనిపించడం లేదు. పైగా అమెరికా దూకుడుగా వెళ్తోంది. ఇరాన్ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అని ఆందోళనలు కనిపిస్తున్నాయి.

అంతర్జాతీయంగా యుద్ధాలు ఏర్పడినప్పుడు ధరలు అనేవి ఎవరి చేతిలో ఉండదు. అలాంటప్పుడు దిగుమతుల మీద ఆధారపడిన దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా మన దేశం కూడా చమురు, బంగారం, ఇతర కీలకమైన వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. యుద్ధం వల్ల రవాణా కూడా ఆగిపోవడంతో సరుకుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ విపరీతంగా బలపడుతున్న నేపథ్యంలో.. రూపాయి విలువ దారుణంగా తగ్గిపోతుంది. ఇది కూడా భారతదేశాన్ని ఆర్థికంగా ఒత్తిడిలోకి నెడుతోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల మీద ఒత్తిడి గించడానికి భారత్ బంగారం మీద సుంకాన్ని పెంచేసింది. వాస్తవానికి ఇలా పెంచడం కొత్తేమీ కాదు..

ఫారెక్స్ నిలువలు తగ్గిపోతున్నప్పుడు కచ్చితంగా ఖరీదైన వస్తువుల దిగుమతిని ప్రభుత్వాలు నిలుపుదల చేస్తాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. బంగారం దిగుమతిని సాధ్యమైనంతవరకు తగ్గించాలని భారత్ భావిస్తుంది. దీనివల్ల చాలావరకు ఫారెక్స్ నిలువలు కరిగిపోకుండా ఉంటాయని భారత ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. చమురు, ఎరువుల వినియోగాన్ని వల్ల తగ్గించడం వల్ల చాలావరకు విదేశీ మారకద్రవ్య నిల్వలను ఖర్చు పెట్టకుండా ఉండవచ్చని… తద్వారా ఆర్థికంగా దేశం బలంగా ఉంటుందని.. రేటింగ్ సంస్థలు కూడా మంచి రేటింగ్ ఇవ్వడం వల్ల తక్కువ వడ్డీకి అప్పులు తీసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version