Warangal: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో గొర్రెల్లో అంత్రాక్స్ వ్యాధి సోకడం కలకలం సృష్టిస్తోంది. దీంతో పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. చుట్టుపక్కల మండలాల్లో గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు. వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. మాంసం కొనే ముందు జీవాలను పశువైద్యులు తనిఖీ చేశారో లేదో నిర్ధారించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

పశువులు, గొర్రెలు, మేకలకు సోకే దొమ్మరోగం లేక నెత్తురెంక లేక రక్తపు దొమ్మ వ్యాధిని ఆంగ్లంలో ఆంత్రాక్స్ గా పిలుస్తారు. అవి తాగే నీరు, తినే గ్రాసం, కీటకాల ద్వారా వాటి రక్తంలోకి ఈ వైరస్ విస్తరించి రెండు మూడు రోజుల్లోనే ప్రాణాలు తీస్తుంది. దీంతో వాటిని పూడ్చిపెట్టాలి. లేకపోతే ఈ వ్యాధి ప్రమాదకరంగా విస్తరించి భయాందోళనలు సృష్టిస్తుంది.
ఆంత్రాక్స్ ఒకసారి వ్యాపిస్తే అది అరవై ఏళ్ల పాటు వదలకుండా ఉంటుందని తెలుస్తోంది. దీంతో దీని నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అదృష్టవశాత్తు చుట్టు పక్కల ప్రాంతాల్లోని పశువుల్లో ఈ లక్షణాలు కనబడకపోయినా జాగ్రత్తగా ఉండాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. చనిపోయిన కళేబరాలను పూడ్చకుండా వదిలేస్తే వాటినుంచి బయటకు వచ్చి ఆ ప్రాంతంలో వ్యాప్తి చెంది ఆందోళనకు గురిచేసే సూచనలున్నాయి.
అయితే మాంసం కొనేటప్పుడు పశువైద్యులు పరీక్షించారో లేదో తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న పశువుల మాంసాన్నే తీసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి. తనిఖీ చేశాకే వాటిని కోసేందుకు వ్యాపారులు ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. రోడ్లపై అమ్మే మాంసాన్ని కొనుగోలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన దుకాణాల్లోనే మాంసం విక్రయాలు జరగాలని చెబుతున్నారు.
Also Read: Huzurabad By Election 2021: ఎవరెన్ని చెప్పినా హుజూరాబాద్ ఫైనల్ రిజల్ట్స్ అదే..