https://oktelugu.com/

Extramarital Affair: ప్రియుని చేతిలో ప్రియురాలు హతం

Extramarital Affair: ఈ రోజుల్లో వివాహ బంధానికంటే తాత్కాలిక సుఖానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబ బాధ్యతలను విస్మరించి తాను కోరుకున్న వాడి వెంట వెళ్లేందుకే నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. అనురాగం, ఆప్యాయతలు దూరం అవుతున్నాయి. నమ్ముకున్న భర్తను కాదని ప్రియుడి మోజులో పడి జీవితాన్ని శిథిలం చేసుకుంటున్నారు. తాళి కట్టిన భర్త, పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను కాదని తన స్వార్థం చూసుకుంది. చివరికి ప్రియుడి చేతిలోనే దారుణ హత్యకు గురయింది. ఆంధ్రప్రదేశ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 26, 2021 / 04:10 PM IST
    Follow us on

    Extramarital Affair: ఈ రోజుల్లో వివాహ బంధానికంటే తాత్కాలిక సుఖానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబ బాధ్యతలను విస్మరించి తాను కోరుకున్న వాడి వెంట వెళ్లేందుకే నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. అనురాగం, ఆప్యాయతలు దూరం అవుతున్నాయి. నమ్ముకున్న భర్తను కాదని ప్రియుడి మోజులో పడి జీవితాన్ని శిథిలం చేసుకుంటున్నారు. తాళి కట్టిన భర్త, పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను కాదని తన స్వార్థం చూసుకుంది. చివరికి ప్రియుడి చేతిలోనే దారుణ హత్యకు గురయింది.

    ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరంలోని దేవుని కడప ప్రాంతానికి చెందిన యశోద(29) అనే మహిళకు అదే ప్రాంతానికి చెందిన జయశంకర్ అనే వ్యక్తితో పది సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలో యశోదకు నిత్యపూజయ్య అలియాస్ సురేష్ తో వివాహేతర సంబంధం (Extramarital Affair) ఏర్పడింది. విషయం కాస్త భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. అక్కడే దేవుని కడపలోనే నాలుగేళ్లుగా సహజీవనం చేస్తోంది.

    అయితే నిత్యపూజయ్యతో కొంతకాలం కలిసి సహజీవనం చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. యశోద నిత్యం పెళ్లి చేసుకోవాలని గోల చేయడంతో నిజ్యపూజయ్య ఆమెను హత్య చేయాలని పథకం రచించాడు. అనుకున్నదే తడవుగా ఈనెల 23న యశోద నిద్రపోతున్న సమయంలో ఆమె ముఖంపై దిండు పెట్టి అదిమిపెట్టి హత్య చేశాడు. ఏమి తెలియనట్టు తాళం వేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆమె సోదరి గోవిందమ్మ ఫోన్ చేయగా సాయంత్రం వరకు స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా యశోద హత్య బయటపడింది.

    ఇలాంటి మరో ఘటన కడప నగరంలో చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన ఆంటోనీ గీత అనే యువతి నాగరాజుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే ప్రాంతంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనిల్ కుమార్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. వీరిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించినా ఇంట్లో పెద్దవారు ఉండడంతో పెళ్లి వాయిదా వేసుకున్నారు. కానీ సహజీవనం మాత్రం చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో గీత ప్రవర్తనపై అనుమానం వచ్చిన అనిల్ నిత్యం వేధించడం మొదలు పెట్టాడు. దీంతో అతడి వేధింపులు భరించలేక గీత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పైకి వెళ్లి ఇంజక్షన్ ద్వారా విషం ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఘటనకు కారణమైన అనిల్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.