అయితే ఒక హీరోయిన్ గా గ్లామర్ ప్రపంచంలో ఎలాంటి హద్దులు లేకుండా ఎంత కష్టపడాలో.. శృతి హాసన్ అంతకంటే ఎక్కువ కష్టపడింది. మొత్తానికి ఎలాగోలా స్టార్ హీరోయిన్ గా నిలబడింది. అయితే, హీరోయిన్స్ లో ఈ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత హిట్లు అందుకున్న హీరోయిన్ శృతి హాసనే. శృతి హాసన్ కు, కరోనాకి ముందు ఫ్లాప్స్ ఉన్నాయి. పైగా సినిమాలకు కూడా చాలా గ్యాప్ వచ్చింది.
ప్రేమలో విఫలం అయ్యాక మద్యానికి అలవాటు పడి, మళ్ళీ ఆ మత్తు నుండి బయట పడటానికి శృతి చాలా టైం తీసుకుంది. ఈ లోపు ఆమె ప్లేస్ లో కొత్త హీరోయిన్లు వచ్చేశారు. ఇక శృతి హాసన్ కి ఛాన్స్ ల రావడం దాదాపు కష్టమే అనుకుంటున్న సమయంలో కరోనా మొదటి సంక్షోభం వచ్చింది.
దాంతో సినిమాల రాక మారింది, అలాగే నటీనటులు ఎంపికలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో శృతి హాసన్ కి క్రాక్ సినిమా తగిలింది. కట్ చేస్తే.. ఆ సినిమా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించింది. ఇక క్రాక్ తర్వాత శృతి హాసన్ హీరోయిన్ గా వచ్చిన మరో సినిమా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’. ఈ సినిమా కూడా బాగానే ఆడింది.
అంటే.. కరోనా తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకున్న ఏకైక హీరోయిన్ శృతి హాసనే. మొత్తమ్మీద కరోనా సమయంలో లాభపడింది శృతి హాసన్ ఒక్కటే. ఇక ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ ‘సలార్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమా హిట్ అయితే.. పాన్ ఇండియా రేంజ్ లో శృతి హాసన్ కెరీర్ మళ్ళీ ట్రాక్ లో పడుతుంది.