Kerala: సాంకేతిక ఎంతగా పెరిగిపోతోందో అనడానికి ఇదే తార్కాణం. యూట్యూబ్ లో చూస్తూ బిడ్డను కనడం ఓ సాహసమే. ప్రతి ఆడదానికి పురుటి నొప్పులు పునర్జన్మతో సమానం అని చెబుతుంటారు. కానీ ఆమె అవేమీ లెక్కచేయలేదు. యూట్యూబ్ సాయంతో బిడ్డకు జన్మనివ్వాలని భావించింది. ఇందుకు యూ ట్యూబ్ సాయం తీసుకుంది. ఇంట్లోనే యూ ట్యూబ్ చూస్తూ బిడ్డను కన్నది. దీనికి సాక్ష్యంగా కేరళలోని మలప్పురం నిలిచింది.

వివరాల్లోకి వెళితే కేరళలోని మలప్పురంలో ఈ నెల 20న ఓ అత్యాచార బాధిత బాలిక యూ ట్యూబ్ సాయంతో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. యూట్యూబ్ వీడియోలో చెప్పినట్లు చేస్తూ బొడ్డు తాడును కూడా కత్తిరించుకుంది. దీంతో తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నారు. దీనిపై పోలీసులు కల్పించుకుని వారిని మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.
బాలిక గర్భం దాల్చడనికి కారకుడైన ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక కావడంతో ఇప్పుడే పెళ్లి చేయలేమని తల్లిదండ్రులు చెప్పినా వినిపించుకోకుండా ప్రియుడు చేసిన నిర్వాకానికి బాలిక తల్లి కావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలిక గర్భం దాల్చిన విషయం కూడా ఎవరికి చెప్పకుండా దాచినట్లు తెలుస్తోంది. కానీ పాప ఏడుపు వినడంతోనే విషయం బయటకు వచ్చినట్లు సమాచారం.
Also Read: Youtube vs Media : సెలబ్రెటీలపై రచ్చ: యూట్యూబ్ vs మీడియా చానెల్స్.. ఎవరు కరెక్ట్ ?
చదువుకోవాల్సిన వయసులో ప్రేమ పేరుతో ఆకర్షణకు గురై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పసిప్రాయంలోనే అమ్మగా మారి భవిష్యత్ ను అంధకారం చేసుకుంటున్నారు. జీవితంలో స్థిరపడినాకే పెళ్లి చేసుకుని సంసారం చేయాల్సిన బాలిక వయసు రాకముందే ఇలాంటి పనులు చేయడంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
Also Read: నాలుగేళ్లుగా అక్కను.. మత్తు మందు ఇచ్చి 17 ఏళ్ల ఆమె చెల్లిపై రేప్