Ghulam Nabi Azad- ABN RK: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఆయనకు వ్యతిరేకంగా కథనాలు రాసేవి. నిండు అసెంబ్లీలో కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆ రెండు పత్రికలంటూ విమర్శలు చేసేవారు. ఆ సమయంలో సర్క్యులేషన్ ఆధారంగా ఈనాడుకు ప్రభుత్వ ప్రకటనలు వచ్చేవి. కానీ మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి ప్రభుత్వ ప్రకటనలు రాకపోయేవి. దీనిని మనసులో పెట్టుకున్న రాధాకృష్ణ ఈనాడు కంటే ఎక్కువగానే వైయస్ రాజశేఖర్ రెడ్డి పై వ్యతిరేకంగా కథనాలు రాయించేవాడు. ఏమాత్రం చిన్న లొసుగు దొరికినా తన రాతలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవాడు. పంజాగుట్ట ఫ్లై ఓవర్ కూలినప్పుడు, ముదిగొండలో కాల్పులు జరిగి ఏడుగురు కన్నుమూసినప్పుడు.. ఆంధ్రజ్యోతి రాసిన వార్తలనే హైకోర్టు సుమోటోగా తీసుకుంది అంటే ఆర్కే కు వైయస్ మీద ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తో ఆర్కే కు సంది కుదుర్చాలని కాంగ్రెస్ నాయకులు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఆ సమయంలో వారి ప్రయత్నాలకు అడ్డుపడింది అప్పటి ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబి ఆజాద్ అని పొలిటికల్ సర్కిల్లో ఇప్పటికీ విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. దీనిని మనసులో పెట్టుకొని ఆర్కే పలుమార్లు గులాం నబి ఆజాద్ పై తన పేపర్లో వార్తలు రాయించాడు. అయినప్పటికీ తన కోపం చల్లారలేదు.

ఇప్పుడు ఎందుకంటే
చంద్రబాబు ప్రయోజనాలకు ఎవరు అడ్డు వచ్చినా ఆర్కే సహించలేడు. ఈనాడు పత్రికన్నా నర్మగర్భంగా వార్తలు రాస్తుంది. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం బజార్లో పోతురాజు టైపు. బట్టలిప్పి చర్నాకోలతో కొట్టేసుకుంటుంది. ఇటీవల తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు రాధాకృష్ణ కలిశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి. అయితే పార్టీని సీనియర్లు నాశనం చేశారని రాధాకృష్ణతో రాహుల్ గాంధీ వాపోయాడట! తాను ప్రతి ఆదివారం రాసే కొత్త పలుకులో ఈ విషయాన్ని ఆర్కే ఉటంకించాడు. అయితే ఈ సందర్భంలోనూ గులాం నబి ఆజాద్ పై తన కోపాన్ని రాతల ద్వారా ప్రదర్శించాడు.అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా గులాం నబి ఆజాద్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట మాత్రమే వినేవాడిని, ఆయన ఇచ్చే డబ్బు మూటలు తీసుకునేవాడని ఆరోపించాడు. కొణిజేటి రోశయ్య నయితే డబ్బుల కోసం ఢిల్లీ కాంగ్రెస్ నేతలు పీక్కు తినేవారని, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా డబ్బు మూటలు పంపించాడని రాసుకుంటూ వచ్చాడు.
Also Read: Ponduru Khadi: ఆవుపేడతో పొందూరు ఖద్దరు… ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్ వరకూ వాడిన దీని ప్రత్యేకత తెలుసా?

” గులాం నబి ఆజాద్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్నప్పుడు వైఎస్ మీద ఈగ కూడా వాల నిచ్చేవాడు కాదు. ఎవరైనా కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీని కలిసేందుకు ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ దక్కకుండా చూసేవాడు. ఒకవేళ వారు సోనియాగాంధీని కలిసినా.. వాళ్ల మధ్యలో దూరి సమావేశాన్ని తూతూ మంత్రంగా ముగించేవాడు. అందువల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుగులేని నేతగా ఎదిగాడని కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు అంటుంటారని” రాధాకృష్ణ కొత్త పలుకులో బాంబు పేల్చాడు. అయితే ఇన్నాళ్లూ గుర్తుకురాని గులాం నబి ఆజాద్ ఇప్పుడే ఎందుకు వార్తల్లో వ్యక్తి అయ్యాడు అంటే.. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశాడు. వెళ్తూ వెళ్తూ రాహుల్ గాంధీ నాయకత్వంపై నాలుగు రాళ్లు వేశాడు. ఎంత కాదనుకున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నమ్ముతున్నాడు. తెలంగాణలో ఎంతో కొంత కాంగ్రెస్ కు బలం ఉంది. అన్నింటికీ మించి రేవంత్ రెడ్డి చంద్రబాబు మాజీ శిష్యుడు. ఇప్పటికీ ఆ సంబంధాలు అలానే ఉన్నాయని భోగట్టా! అయితే తన నాయకత్వాన్ని బలపరచాలని ఇటీవల రాహుల్ గాంధీ ఆర్కే ను కోరిన నేపథ్యంలో.. పాత పగను దృష్టిలో పెట్టుకొని గులాం నబి ఆజాద్ ను కొత్త పలుకు ద్వారా కడిగిపారేశాడు.
Also Read:Serena Williams: తెల్లజాతీయులను మట్టి కరిపించిన నల్ల కలువ
[…] […]