జీహెచ్‌ఎంసీ ఎన్నికలే కేటీఆర్‌‌ టార్గెట్?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో దుబ్బాక నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అసలే ఎన్నికలకు ప్రిపేర్‌‌ అవుతున్న అధికార పార్టీ టీఆర్‌‌ఎస్‌కు ఇప్పుడు మహానగరంలో వచ్చిన వరదలు తలనొప్పిలా మారాయి. Also Read: నాయిని అన్నా.. ఒగ్గేసి పోయావా? అందుకే.. ఈ నష్టాన్ని కష్టాన్ని ఎదుర్కొనేందుకు స్వయంగా మంత్రి కేటీఆర్‌‌ రంగంలోకి దిగారు. నిలువెత్తు నీళ్లలో దిగి ఆయన కాలనీల్లో […]

Written By: NARESH, Updated On : October 22, 2020 10:00 am
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో దుబ్బాక నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అసలే ఎన్నికలకు ప్రిపేర్‌‌ అవుతున్న అధికార పార్టీ టీఆర్‌‌ఎస్‌కు ఇప్పుడు మహానగరంలో వచ్చిన వరదలు తలనొప్పిలా మారాయి.

Also Read: నాయిని అన్నా.. ఒగ్గేసి పోయావా?

అందుకే.. ఈ నష్టాన్ని కష్టాన్ని ఎదుర్కొనేందుకు స్వయంగా మంత్రి కేటీఆర్‌‌ రంగంలోకి దిగారు. నిలువెత్తు నీళ్లలో దిగి ఆయన కాలనీల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. జరిగిన నష్టానికి ప్రభుత్వం తరపున అందిస్తున్న సాయం.. తక్కువే అనే అభిప్రాయం ఏర్పడకుండా.. ప్రభుత్వం తరపున ఇంకా సాయం అందిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే.. కేటీఆర్‌‌ ఇవన్నీ చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని కూడా విమర్శలు వస్తున్నాయి. నవంబర్‌లో గ్రేటర్ ఎన్నికలు పెట్టి వందకుపై సీట్లను గెలిచేసి.. సత్తా చాటాలని కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆయనకు పట్టాభిషేకం కూడా ఉండే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా వరదలు రావడం.. దాని వల్ల సగానికిపైగా జనం నష్టపోవడంతో వారిలో అసంతృప్తి మొదలైంది.

పరామర్శలకు వెళ్తున్న నేతలను కొన్ని చోట్ల ప్రజలు నిలదీస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోలేదని.. నష్టపోయిన వారిని ఆదుకోలేదనే అసంతృప్తి అంతకంతకూ పెరుగుతూననే ఉంది. ఈ విషయంలో కేటీఆర్ ప్రజల అసంతృప్తిని చల్లార్చేందుకు తన వంతు ప్రయత్నాన్ని సీరియస్‌గా ప్రారంభించారట. హైదరాబాద్‌ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద వర్షమని.. 1908లో ఒకే రోజు 43 సెంటీమీటర్ల వర్షం పడిందని.. ఉన్నంతలో బెటర్‌గా పనిచేశామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: కేసీఆర్‌‌ అంటే పవన్‌కు అందుకే భయమా?

అయితే.. ఇటీవల ఓ కార్పొరేటర్‌‌ను గల్లాపట్టి నిలదీసిన సంఘటననూ ఆయన గుర్తు చేస్తూ వచ్చారు. ప్రజాప్రతినిధులపై బాధితుల దాడుల వ్యవహారం కూడా కలవర పరుస్తోంది. దీనికితోడు మరిన్ని దాడులు పెరిగే ప్రమాదమూ ఉండొచ్చని భావించిన కేటీఆర్‌‌ తానే స్వయంగా రంగంలోకి దిగారు. ఇలా పర్యటించడం వల్ల అటు ప్రజాప్రతినిధులకు దగ్గరగా ఉండడమే కాకుండా ప్రజల అసంతృప్తిని తగ్గించొచ్చని అనుకుంటున్నారట.