Israel: తమ దేశం మీద దాడి చేసిన హమాస్ లపై ఇజ్రాయిల్ రగిలిపోతోంది. ఈ భూమ్మీద హమాస్ ను లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. ఇజ్రాయిల్ అధ్యక్షుడు నేతాన్యాహు కూడా అలాంటి ప్రకటనలే చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ దేశ సైన్యాన్ని గాజా లోకి దూసుకుపోయే విధంగా ఆయన ఆదేశాలిస్తున్నారు.. ఫలితంగా 11 లక్షల మంది పాలస్తీనీయులు ఉత్తర గాజా నుంచి 24 గంటల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటూ ఇజ్రాయిల్ దేశ సైనికులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీ స్థాయి లో బలగాలను, యుద్ధ ట్యాంకులను అక్కడ మోహరించారు. కానీ, ఇజ్రాయిల్ గ్రౌండ్ ఆపరేషన్ లోకి దిగితే ఏమవుతుంది? అది అనుకున్న పని పూర్తవుతుందా? అది అంత సులభం కాదంటున్నారు రక్షణ రంగా నిపుణులు. నాలుగు వైపుల నుంచి దిగ్భందించినా గాజా లో ఇజ్రాయిల్ కు అనేక సవాళ్లు ఎదురవుతాయని చెబుతున్నారు.
అతి తక్కువ స్థలంలో..
గాజా నగరం ఇరుకుగా ఉంటుంది.. అతి తక్కువ స్థలంలో ఎక్కువ భవనాలు నిర్మించడంతో యుద్ధ ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలు ప్రయాణించడం అంత సులువు కాదు. ఆ సందులో నుంచి హమాస్ తీవ్రవాదులు ప్రతిదాడి చేసే అవకాశం లేకపోలేదు. పజిళ్ళ ను పోలి ఉన్న ఇళ్ళు, వాటి నల్ల అద్దాల నుంచి హమాస్ తీవ్రవాదులు కాల్పులు జరిపే అవకాశం ఉంది. 2024 లో ఇలాగే గాజా లోపలికి వచ్చిన ఇజ్రాయిల్ సైన్యానికి హమాస్ ఉగ్రవాదులు చుక్కలు చూపించారు.
ఎందుకూ పనికి రాకుండా పోతుంది
గాజా నగరంలోని ఇరుకు సందుల్లో యాంటీ ట్యాంక్ మిసైళ్ళు, రాకెట్ ప్రోపైల్డ్ గ్రెనైడ్ల ముందు భారీ యుద్ద ట్యాంకులతో కూడిన సైన్యం ఎందుకూ పనికి రాకుండా పోతుందనేది ఉక్రెయిన్, సిరియాలు నేర్పిన అనుభవం. పైగా మ్యాన్ పోర్ట బుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్( మ్యాన్ ప్యాడ్) లు హమాస్ ఉగ్రవాదుల వద్ద ఉన్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే చిన్న చిన్న రాకెట్లు, మోర్టార్లను వేల సంఖ్యలో హమాస్ సమకూర్చుకుంది. వారం తిందుట ఇజ్రాయిల్ పై దాడి చేసిన సందర్భంగా మూడు గంటల వ్యవధిలోనే 4,500 కు పైగా రాకెట్లను ప్రయోగించి ఉక్కిరి బిక్కిరి చేసింది.
డ్రోన్లు
ఈసారి యుద్ధంలో హమాస్ అమ్ములపొదిలో సరికొత్తగా డ్రోన్లు అనే ఆయుధాలు చేరాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న చిన్న చిన్న డ్రోన్ల ద్వారా బాంబులు జారవిడమే కాకుండా.. ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా వినియోగించిన భారీ డ్రోన్లు కూడా హమాస్ వద్ద ఉన్నాయి. ఇవి ఇరాన్ దేశం నుంచి సరఫరా ఆయా అనేది బహిరంగ రహస్యం.
మొత్తం భూగర్బ టన్నెల్స్ ఉన్నాయి
గాజా ఇరుకు నగరం మాత్రమే కాదు. భూగర్బ టన్నెల్స్ మెండుగా ఉన్న ప్రాంతం. తన బలగాలను, ఆయుధాలను ఒక చోట నుంచి మరొకచోటుకు తరలించేందుకు.. మెరుపు దాడులు చేసేందుకు ఈ టన్నెల్స్ నిర్మించారు. 2014 దాడిలో ఇజ్రాయిల్ సైన్యం అనేక టన్నెల్స్ ను కూల్చేసింది.. ఇది జరిగి 9 సంవత్సరాలు పూర్తయ్యాయి. మళ్లీ కొత్త వాటిని మరింత సమర్థవంతంగా హమాస్ తయారు చేసుకుంది.
ఖాళీ చేయడం సాధ్యమేనా?
గాజా లో జనాభా పది లక్షల మంది. కేవలం 24 గంటల వ్యవధిలో అంత మంది జనాభాను ఖాళీ చేయించడం దాదాపు అసాధ్యం. సాధారణ ప్రజల మాటను ఉగ్రవాదులు ఇతర ప్రాంతాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. గాజా లో ప్రస్తుతం 50,000 మంది గర్భిణులు ఉన్నారు. మరోవైపు ప్రజలు ఎవరు కూడా గాజా విడిచిపెట్టి వెళ్ళకూడదని హమాస్ పిలుపునిచ్చింది. ప్రజలు నగరంలో ఉంటే తమకు రక్షణ కవచంగా ఉపయోగపడతారనేది హమాస్ ఎత్తుగడ.
ఒకవేళ గాజాపై ఇజ్రాయిల్ గ్రౌండ్ ఆపరేషన్ కు దిగితే బయటనుంచి లెబనాన్, సిరియా, ఇరాన్ లోని హమాస్ అనుకూల దళాలు.. ఇజ్రాయిల్ దేశంపై యుద్దానికి దిగే అవకాశం ఉంది. ఇన్ని దేశాలు యుద్ధానికి దిగితే ఇజ్రాయిల్ సైన్యంపై ఒత్తిడి పెరుగుతుంది. మరో ఉగ్రవాద సంస్థ హిజ్ బుల్లా లెబనాన్ సరిహద్దుల నుంచి అనధికారికంగా ఇజ్రాయిల్ పై దాడులు చేస్తోంది. ఒకవేళ ఇజ్రాయిల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపడితే హిజ్ బుల్లా హమాస్ కు మద్దతుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.