https://oktelugu.com/

Gautam Adani Donation : అదానీ 60వ పుట్టిన రోజు.. రూ.60 వేల కోట్ల విరాళం

Gautam Adani Donation : ప్రపంచ ధనవంతుల్లో 10వ వ్యక్తి.. భారత్ లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీ అంటే ఈరోజుల్లో తెలియని వారుండరు. ఈమధ్య వస్తున్న ప్రతీ న్యూస్ లో అదానీ పేరు బాగా వినిపిస్తోంది. గుజరాత్ కు చెందిన ఈ వ్యాపార వేత్త దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రపంచ కుభేరుల కంటే ధీటుగా సంపాదిస్తూ భారత్ పేరు నిలబెడుతున్నాడు. దీంతో అదానీ అంటే ఒక వ్యక్తి కాదు.. ఇట్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 24, 2022 9:51 am
    Follow us on

    Gautam Adani Donation : ప్రపంచ ధనవంతుల్లో 10వ వ్యక్తి.. భారత్ లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన గౌతమ్ అదానీ అంటే ఈరోజుల్లో తెలియని వారుండరు. ఈమధ్య వస్తున్న ప్రతీ న్యూస్ లో అదానీ పేరు బాగా వినిపిస్తోంది. గుజరాత్ కు చెందిన ఈ వ్యాపార వేత్త దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రపంచ కుభేరుల కంటే ధీటుగా సంపాదిస్తూ భారత్ పేరు నిలబెడుతున్నాడు. దీంతో అదానీ అంటే ఒక వ్యక్తి కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అని అంటుంటారు. పైకి చూస్తే ఇంకా యువకుడిలాగే కనిపిస్తున్న అదానీ ఇప్పుడు 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా గౌతమ్ అదానీ ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టాడు. ఆయన పుట్టిన రోజే కాకుండా తన తండ్రి 100వ జయంతి కూడా ఈనెలలోనే ఉండడంతో భారీ సహాయాన్ని ప్రకటించాడు.

    అపర కుబేరుడు అదానీ 1962 జూన్ 24న జన్మించారు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన నికర ఆస్తి విలువ 2021 లో 50 బిలియన్ డాలర్లకు చేరింది. పోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం 95 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటివరకు భారత్ కుభేరుడిగా చెప్పుకుంటున్న అంబానీ సంపద కంటే అదానీ సంపద పెరిగింది. ప్రస్తుతం ఆయన ప్రపంచ కుభేరుల్లో టాప్ 10 పొజిషన్లో ఉన్నారు. ఇదే సంవత్సరంలో ముఖేశ్ అంబానీ ఆదాయం 81 బిలియన్ డాలర్లకు పెరిగింది.

    అంబానీ తండ్రి ఆస్తిని పెంపెదల చేస్తుండగా.. అదానీ మాత్రం ఎవరి అండ లేకుండా స్వశక్తితో ఎదిగాడు. అదానీ తండ్రి టెక్స్ టైల్ బిజినెస్ ఓనర్. అదానీ కాలేజీ చదువును మధ్యలోనే మానేసి డైమండ్ బిజినెస్ కోసం 1980లో ముంబై వెళ్లారు. ఆ తరువాత గుజరాత్ కు తిరిగి వచ్చారు. ప్లాస్టిక్ వ్యాపారంలో అడుగుపెట్టాడు. 1988లో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ను స్థాపించారు. ప్రస్తుతం దేశంలో బొగ్గు, మైనింగ్, లజిస్టిక్స్, విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీ, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ పోర్టులు, డేటా సెంటర్లు, సిమెంట్ తదితర రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

    తాజాగా అదానీ పుట్టిన రోజు సందర్భంగా అందరూ ఆశ్చర్యపోయేలా ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. తన 60వ పుట్టిన రోజు సందర్భంగా రూ.60 వేల కోట్ల రూపాయలను సమాజ సేవకు ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సంవత్సరం తన తండ్రి శాంతిలాల్ అదానీ 100వ జయంతి కూడా రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆయన.. 60 వేల కోట్లతో ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అదానీ ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు.

    ఈ సందర్భంగా అదానీ ట్విట్టర్ లో తన గురించి రాసుకొచ్చారు. ఆయనిచ్చే విరాళం ఆత్మనిర్బర్ భారత్ కు పునాది వేస్తుందని అన్నారు. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా ఈ విరాళం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ మొత్తాన్ని ఏయే రూపాల్లో ఖర్చే చేయాలనేది ఆయా కమిటీలలు నిర్ణయిస్తాయని, తన కుటుంబ సభ్యులు కమిటీల్లో సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఇప్పటి వరకు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్, వారెన్ బఫెట్ లు తమ సంపదలో ఎక్కువ శాతం విరాళం ఇచ్చారు. ఇప్పుడు భారత్ తరుపున అదానీ భారీగా విరాళం ప్రకటించి వారి సరసన చేరారు.