Homeజాతీయ వార్తలుGas Leak Blast Viral Video: వంటింట్లో గ్యాస్ లీక్.. భారీ పేలుడు.. ఒళ్ళు జలదరించే...

Gas Leak Blast Viral Video: వంటింట్లో గ్యాస్ లీక్.. భారీ పేలుడు.. ఒళ్ళు జలదరించే దృశ్యాలు: వైరల్ వీడియో

Gas Leak Blast Viral Video: నేటి కాలంలో గ్యాస్ ద్వారానే వంట చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెడితే నగరాల వరకు ఇదే వరుస కొనసాగుతోంది. అయితే గ్యాస్ సిలిండర్ వాడే క్రమంలో ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. అంతేకాదు చుట్టుపక్కల గృహాలు కూడా దెబ్బతింటాయి. ప్రాణం నష్టం కూడా జరుగుతుంది. అందువల్లే గ్యాస్ స్టవ్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ ఇంట్లో వంటగ్యాస్ లీకై భయానక దృశ్యాలు చోటుచేసుకున్నాయి.. దీనికి సంబంధించిన వీడియో మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయింది. అది కాస్త సామాజిక మాధ్యమాల లో బయటి ప్రపంచానికి తెలిసింది.. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం ఓ మహిళ తన ఇంట్లో గ్యాస్ స్టవ్ కు సిలిండర్ ను బిగిస్తోంది ఇందులో భాగంగా గ్యాస్ పైప్ లైన్ ఊడిపోయింది. అయితే దానిని తిరిగి అమర్చడానికి ప్రయత్నిస్తుంటే పైపు నుంచి ఒక్కసారిగా గ్యాస్ పైకి వచ్చింది. దీంతో ఆమెకు దానిని ఎలా నియంత్రించాలో అర్థం కాలేదు. ఫలితంగా సిలిండర్ ను కిచెన్ నుంచి బయటకు తీసుకొచ్చి హాల్లో పడేసింది. ఆ మహిళ అనంతరం భయంతో బయటికి పరుగులు పెట్టింది. పైపు ద్వారా లీక్ అయిన గ్యాస్ఇంట్లోకి వ్యాపించింది. కొద్ది క్షణాల్లోనే గ్యాస్ రావడం ఆగిపోవడంతో.. ఆ మహిళ ఇంట్లోకి వచ్చింది. ఒక వ్యక్తి సహాయంతో ఆ సిలిండర్ అక్కడి నుంచి తీయడానికి ప్రయత్నాలు చేసింది. క్రమంలోనే భారీ ఎత్తున పేలుడు సంభవించింది. కూడా అదే స్థాయిలో బయటికి వచ్చాయి.

Also Read:  LG Polymers: చంద్రబాబు రాగానే ‘ఎల్జీ’ సంస్థ ఎందుకు మారింది.. అన్ని కోట్లు ఎందుకు విడుదల చేసింది?

ప్రాణాలతో బయటపడ్డారు

అయితే ఇంట్లో తలుపులు తెరిచి ఉండడంతో ఆ మహిళ, మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ఇక దీనికి సంబంధించిన దృశ్యాలు మొత్తం వారి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదం దేశ ఆర్థిక రాజధానులు చోటుచేసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం మాత్రం తెలియ రాలేదు. సీసీ కెమెరాలు కనిపించిన అంకెల ప్రకారం జూన్ 18న మధ్యాహ్న 3 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది. ఈ వీడియోను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాలలో షేర్ చేశాడు..” లేచిన ఘడియ బాగుంది. ఆ ఇంటికి ఉన్న రెండు తలుపులు, కిటికీలు తెరిచి ఉన్నాయి. అయితే ఆ సమయంలో గ్యాస్ బయటికి విడుదల కావడంతో ప్రమాదం తక్కువ స్థాయిలో జరిగింది. లేకపోతే ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయేదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు..” గ్యాస్ స్టవ్ బిగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పైప్ లైన్ అమర్చే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. నిపుణుల సలహా తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని” నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular