Gas cylinder insurance coverage: ఒకప్పుడు కట్టెల పొయ్యి మాత్రమే కనిపించే ఇల్లు ఇప్పుడు గ్యాస్ పొయ్యితో కనిపిస్తోంది. నేటి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ తప్పనిసరిగా ఉంటుంది. వంట గ్యాస్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉండడంతో చాలామంది వీటిని వాడుతూ వస్తున్నారు. అయితే గ్యాస్ స్టవ్ వాడేటప్పుడు ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ లీక్ అవడం.. గ్యాస్ స్టవ్ పై వచ్చే మంట పెద్దదిగా రావడం వంటి విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అయితే సాధారణ ఇన్సూరెన్స్ మాదిరిగానే గ్యాస్ సిలిండర్ పై కూడా రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ ఎవరికి వర్తిస్తుంది? ఎలా దీనిని క్లైమ్ చేసుకోవాలి?
Also Read: నోట్లపై ఉండే ఈ గీతల అర్థం తెలుసా?
గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటాం. గ్యాస్ లీక్ అయ్యి లేదా గ్యాస్ సిలిండర్ నుంచి స్టవ్ కు వెళ్లే మార్గంలో ఉండే పైపు డ్యామేజ్ కావడంతో గ్యాస్ బయటకు వెళ్లి సిలిండర్లు పేలిన సంఘటనలు ఉన్నాయి. అయితే గ్యాస్ ప్రమాదాల వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా ఇల్లు ధ్వంసం అవడం కూడా జరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి గ్యాస్ ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అయితే గ్యాస్ సిలిండర్ పై కూడా ఇన్సూరెన్స్ ఉంటుందని చాలామందికి తెలియదు.
HP, Bharat Gas, Indian వంటి ఏ గ్యాస్ సిలిండర్ వాడిన దీనిపై కచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎవరైతే ఈ కంపెనీల సిలిండర్ వాడిన సమయంలో ప్రమాదాలు జరుగుతాయో.. ఆ ప్రమాదానికి సంబంధించిన నష్టాన్ని ఆయా కంపెనీలు చెల్లిస్తాయి. ఈ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే..? ఉదాహరణకు ఒక ఇంట్లో గ్యాస్ పేలి ఎవరైనా మరణిస్తే.. వారికి రూ. 6 లక్షల వరకు పరిహారం సిలిండర్ కంపెనీ వారు చెల్లిస్తారు. అలాగే ఈ గ్యాస్ ప్రమాదంలో ఎంత మంది చనిపోయినా.. వారందరికీ రూ. 6 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే. ఒకవేళ గ్యాస్ ప్రమాదంలో ఎవరైనా తీవ్రంగా గాయపడితే.. వారికి గ్యాస్ సిలిండర్ కంపెనీ వారు రూ. రెండు లక్షల చొప్పున పరిహారం అందిస్తారు. ఇలా ఎంతమంది గాయపడినా.. వారందరికీ పరిహారం దక్కుతుంది.
Also Read: టాన్టాలియం.. భారత్‌కు గేమ్–ఛేంజర్‌గా మారనున్న అరుదైన లోహం!
ఒకవేళ ఒకరి ఇంట్లో గ్యాస్ ప్రమాదం జరిగింది అనుకుందాం.. ఈ ప్రమాదంలో పక్కింటి వారు కూడా మరణించడం? గాయపడమా? జరిగితే వారికి కూడా పరిహారం వచ్చే అవకాశం ఉంది. ఇలా ఒక ప్రమాదంలో రూ. 50 లక్షల వరకు పరిహారం అందిస్తారు. మరి ఈ పరిహారం కోసం ఎవరు? ఎలా? దరఖాస్తు చేసుకోవాలి.
ఒకరి ఇంట్లో ప్రమాదం జరిగితే ఎవరైనా మరణిస్తే.. వారికి సంబంధించిన కుటుంబీకులు సంబంధిత గ్యాస్ సిలిండర్ డీలర్ ను కలవాలి. వారు అడిగిన పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. వారు క్లీన్ చేసిన కొద్ది రోజుల్లోనే పరిహారం అందుతుంది. ఈ విధంగా గ్యాస్ సిలిండర్ పై కూడా ఇన్సూరెన్స్ ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. అయితే ఈ ఇన్సూరెన్స్ కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.