
ఇతిహాసాల్లో గంగ పవిత్రత గురించి ఎన్నో కథలు ఉన్నాయి. శివుడి తలపై కొలుదీరిన గంగ భారతీయ సంస్కృతిలో భాగమై పోయింది. గంగానదిలో స్నానమచరిస్తే సర్వపాపాలు నశిస్తాయని అనేది భారతీయుల నమ్మకం. అయితే గత కొన్నేళ్లుగా మానవుడు చేస్తున్న తప్పిదాల వల్ల గంగానది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఈ నదిలోని నీరు అసలు తాగడానికి కూడా పనికి రాకుండా మారాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘నామామీ గంగా’ పేరిట గంగానదిని శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టింది. వేల కోట్ల రూపాయాలు ఖర్చుపెట్టినప్పటికీ గంగానదిలోని కాలుష్యాన్ని పూర్తిగా నివారించలేకపోయారు.
కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందేనా?
అయితే కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచమంతా లాక్డౌన్ చేయబడింది. ఈనేపథ్యంలో వాయు, జల, భూ కాలుష్యం తగ్గాయి. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మరి ప్రకృతికి మాత్రం మంచినే చేసింది. జల కాలుష్యం తగ్గడంతో గంగనది కాలుష్యం పూర్తిగా తగ్గిపోయిందని కాలుష్య నియంత్రణ బోర్డ్ ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం గంగానదిలోని నీటిని నేరుగా తాగొచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కట్టడికి గంగాజలం ఔషధంగా పని చేస్తుందనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.
దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు!
గంగానది నీటిపై నింజా వైరస్ జీవిస్తోంది. దీనినే మనదేశంలో గంగత్వ అని పిలుస్తున్నారు. నిజానికి అది వైరస్ కాదు.. ఒక రకమైన బ్యాక్టరియా. ఇందులో కరోనా వైరస్ ను తరిమికొట్టే శక్తివంతమైన స్ట్రెయిన్ ఉందని అతుల్య గంగా వ్యవస్థాపకుడు మేజర్ మనోజ్ కేశ్వర్ (రిటైర్డ్) చెబుతున్నారు. ఆయన కోరిక మేరకు జలశక్తి మంత్రిత్వ శాఖలోని గంగా శుద్ధి జాతీయ మిషన్ భారత వైద్య పరిశోధనా మండలికి ప్రతిపాదన చేసింది. ఊహాకల్పితంగా ఈ ప్రతిపాదన తీసుకురాలేదని.. ఇందుకు బలమైన కారణం కూడా ఉందని మనోజ్ కేశ్వర్ తెలిపారు. గంగా జలంలోని నింజా వైరస్.. కరోనా వైరస్‌ను చంపుతుందో లేదో పరిశీలించడంలో తప్పు లేదు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఇది విజయవంతమైతే మానవాళికి మంచి జరుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.