Secunderabad Gang Rape: హైదరాబాద్ అత్యాచారాలకు కేంద్రంగా మారుతోంది. రోజుకో అత్యాచార ఘటన తల్లిదండ్రును కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా ఓ బాలికపై జరిగిన అత్యాచార సంఘటన మరువకముందే మరో లైంగిక దాడి జరిగినట్లు వెలుగులోకి రావడంతో అందరు కంగారుకు గురవుతున్నారు. బాలికలే లక్ష్యంగా దుండగులు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ఉంటే ఏం చేస్తుంది? బాలికలపై వరుస అత్యాచారాల భయంతో అందరు భయపడుతున్నా ప్రభుత్వం మాత్రం వారిలో స్థైర్యం నింపడం లేదు. నిందితులపై చర్యలు ఉండటం లేదు. ఇదేనా ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇదేనా పాలన తీరు అని అందరు విమర్శిస్తున్నారు. ఇంకా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారట రాష్ట్ర రాజకీయాలే సరిగా చేయని వారు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారా? అనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి.

నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగిన బాలికపై రేప్ ఘటన మరువక ముందే కార్ఖానా ప్రాంతంలో మరో బాలకపై ఐదుగురు దుండగులు అత్యాచారం చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన ధీరజ్, రితేష్ అనే యువకులు బాలికతో చనువు పెంచుకున్నారు. మనం ఓసారి కలుద్దామని హోటల్ కు రమ్మని అత్యాచారం చేశారు. తరువాత ఆ వీడియో అందరికి చూపిస్తామని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేస్తూనే ఉన్నారు. ఇటీవల మరోమారు బాలికను హోటల్ కు రమ్మని మరో ముగ్గురితో అత్యాచారం చేయించారు. దీంతో బాలిక ముబావంగా ఉండటంతో ఏం జరిగిందని తల్లిదండ్రులు నిలదీస్తే జరిగిన విషయం చెప్పింది.
Also Read: Ancient Iraqi City: నదిలో రహస్యం.. పురావస్తు శాఖ పరిశోధన!!
దీంతో వారు బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారు. నిందితులపై చట్టపరంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అభం శుభం తెలియని బాలికలపై అఘాయిత్యాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరుతోనే దుండగులు రెచ్చిపోతున్నారని వాపోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మంట గలుస్తున్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఫలితంగా వారి భవిష్యత్ ఏమిటని అందరు నిలదీస్తున్నారు.

ఇందులో ఓ మైనర్ కూడా ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. బాలుడిని మాత్రం జునైవల్ హోంకు తరలించారు. ముక్కుపచ్చలారని బాలికలపై వరుసగా లైంగికదాడులు జరుగుతుంటే చట్టం ఉందా? వారికి రక్షణ కల్పిస్తుందా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
[…] Also Read: Secunderabad Gang Rape: ‘రేప్’ల రాజధాని: హైదరాబాద్ ల… […]
[…] Also Read: Secunderabad Gang Rape: ‘రేప్’ల రాజధాని: హైదరాబాద్ ల… […]