Gujarat Elections 2022-BJP: గుజరాత్.. అనగానే మనందరికీ గుర్తొచ్చేది ప్రధాని నరేంద్రమోదీ.. ఆ రాష్ట్రానికి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి.. గుజరాత్ మోడల్‌ను దేశవ్యాప్తంగా ప్రచారం చేసి.. దేశ ప్రజల మన్ననలు పొందారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు గుజరాత్‌లో ఎన్నికలు జరుగబోతున్నాయి. డిసెంబర్ 1, 5వ తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని సొంత రాష్ట్రం కావడం, అక్కడ బీజేపీ 25 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ఈ సారి ఎవరు గెలుస్తారని యావత్ భారత దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సారి అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా ఈసారి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు, పార్టీల దృష్టంతా గుజరాత్‌పై ఉంది.

శక్తివంతంగా బీజేపీ..
గుజరాత్‌లో తాజా పరిస్థితిపై సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ, లోక్‌నీతి సర్వే చేశాయి. వారి అధ్యయనం ప్రకారం.. ఇప్పటికీ బీజేపీ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిర్ధారించాయి. మూడింట రెండో వంతు బీజేపీకి మద్దతుగా ఉన్నారని తెలిపింది. బీజేపీ వ్యతిరేక ఓట్లు మాత్రం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు షేర్ చేసుకుంటాయని తెలిపింది.
గుజరాతీల గుండెల్లో కమలం..
బీజేపీ గుజరాతీల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. 25 ఏళ్లుగా పాలన సాగిస్తున్నా.. ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. దీనికి పెద్ద పునాది ఉంది. చారిత్రక నేపథ్యం చూస్తే బీజేపీకి ముందు భారతీయ జనసంఘ మాత్రమే బలంగా ఉండేది. నాడు కాంగ్రెస్ ఆధిపథ్యమే కొనసాగేది. గాందీ, నెహ్రూ గుజరాతీలు కావడంతో.. నాడు ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేవారు. అయితే భారతీయతతో వచ్చిన భారతీయ జనసంఘ్.. కాంగ్రెస్‌ను క్రమంగా దెబ్బతీస్తూ వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రాభవం చెదిరిపోతూ వచ్చింది. 1990వ దశకం తర్వాత నుంచి బీజేపీ ఆధిపత్యం పూర్తిగా కొనసాగుతోంది.
హిందుత్వ అజెండాతో..
1960వ దశకంలో గుజరాత్‌లో కుల ప్రాతిపదికన ఓటింగ్ ఎక్కువ జరిగేది. కులాల పట్టింపు ఎక్కువగా ఉండేది. బల్వంతరాయ్ మెహతా సీఎంగా ఉన్న సమయంలో పౌర విమానయాన్ని పాకిస్తానీలు కూల్చారు. దీంతో అప్పటి వరకు కాంగ్రెస్ తీసుకున్న లౌకిక నినాదం. ఆ ఘటన తర్వాత భారతీయ జనసంఘ్ యాంటీ ముస్లిం సెంటిమెంను ఎత్తుకుంది. అయితే ఇదొక్కటే ఎన్నికల్లో గెలుపునకు దోహదపడదని భావించి, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేసింది. ఈ క్రమంలో 1975లో కాంగ్రెసేతర పార్టీలతో కలిసి భారతీయ జనసంఘ్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో అధికారంలోకి వచ్చింది.
ఎమర్జెన్సీ తర్వాత..
ఎమర్జెన్సీ కాలంలో దేశంలో అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. జనతా పార్టీ ఏర్పడింది. ఈ పార్టీ తరఫున గుజరాత్‌కు చెందిన మొరాజ్జీ దేశాయ్ ప్రధాని కూడా అయ్యారు. తర్వాత జనతా పార్టీ చీలిపోయింది. దీంతో అందులోని అనేక మంది భారతీయ జనసంఘ్‌లో చేరారు. దీంతో జనసంఘ్ బలపడింది. అదే సమయంలో భారతీయ జన సంఘ్ కాస్త భారతీయ జనతా పార్టీగా మారింది. ముస్లిం వ్యతిరేకతను, హిందుత్వ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమైంది.
కుల రాజకీయాలను అధిగమించి..
1980వ దశకంలో గుజరాత్‌లో దళిత్, ఆదివాసీ, ముస్లిం రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. అదే సమయంలో బీజేపీ కుల రాజకీయాలను అధిగమించేందుకు హిందుత్వ ఎజెండా తీసుకుంది. దీంతో రిజర్వేషన్ ఉద్యమాల సమయంలో కూడా హిందుత్వం ద్వారా ఆ ఉద్యమాలను అధిగమించి రాజకీయంగా బలపడింది.
మోదీ హయాంలో అభివృద్ధి మంత్రం..
ఇక 1990 దశకంలో గుజరాత్‌లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలో హిందుత్వ ఎజెండా ఒక్కటే ప్రతీసారి బీజేపీని గెలిపించదని గుర్తించారు మోదీ. దీంతో అభివృద్ధి ఎజెండాను కూడా మోదీ తీసుకున్నారు. అప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుజరాత్‌లో అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించారు మోదీ. దీనినే దేశవ్యాప్తంగా ప్రచారం కూడా చేసి గుజరాతీలో బలమైన శక్తిగా ఎదిగారు. గ్రామాలు, మండల స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేశారు.

కలిసొచ్చిన గుజరాతీ వాదాం..
మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హిందుత్వంతోపాటు యాంటీ ముస్లిం సెంటిమెంట్ గుజరాత్ అభివృద్ధి, గుజరాతీ వాదం కూడా బీజేపీ బలోపేతానికి దోహదపడ్డాయి. గుజరాత్‌లో ప్రాంతీయ పార్టీలు లేకోవడంతో జాతీయ పార్టీ అయిన బీజేపీనే గుజరాతీ వాదాన్ని బలంగా దేశవ్యాప్తం చేసింది. సెంటిమెంట్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంది. దీంతో బీజేపీ గుజరాతీల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించింది.
హిందు ఓట్ల పోలరైజేషన్..
ఇక గుజరాత్‌లో హిందూ ఓట్ల పోలరైజేషన్ మొదటి నుంచి బీజేపీ సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఐదు ఎన్నికల్లో.. కాంగ్రెస్ లౌకిక నినాదం అందుకోగా, బీజేపీ హిందూ నినాదంతోనే ముందుకు వెళ్తోంది. మెజారిటీ హిందువులతోపాటు ముస్లింలు కూడా బీజేపీకే అనుకూలంగా ఉంటున్నారు. కారణం హిందూ ఓట్ల పోలరైజేషన్‌లో కాంగ్రెస్ బీజేపీని అధిగమించడం లేదు. దీంతో భారతీయ జనతాపార్టీ గుజరాతీల కుటుంబ పార్టీగా, ఇంటి పార్టీగా, తమ సొంత పార్టీగా మారిపోయింది అనడంలో సందేహం లేదు.