https://oktelugu.com/

B Tech Ravi vs ABN RK : జగన్ కు తెలియకుండా పులివెందులలో ఒక్క మర్డర్ కూడా జరగదు

B Tech Ravi vs ABN RK : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ వేగంగా అడుగులు వేస్తోంది..ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి ని జైల్ లో వేసింది..రేపో మాపో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి పలు కీలకమైన విషయాలు తెలిసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ “బీటెక్ రవి” సంచలన నిజాలు బయట పెట్టారు. ఆంధ్రజ్యోతి […]

Written By:
  • NARESH
  • , Updated On : April 20, 2023 / 05:31 PM IST
    Follow us on

    B Tech Ravi vs ABN RK : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ వేగంగా అడుగులు వేస్తోంది..ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి ని జైల్ లో వేసింది..రేపో మాపో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి పలు కీలకమైన విషయాలు తెలిసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ “బీటెక్ రవి” సంచలన నిజాలు బయట పెట్టారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో బీటెక్ రవి ఈ విషయాలు బయట పెట్టారు. వచ్చే ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో విడుదలైంది.

    “జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ఇడుపులపాయకు ప్రత్యేకమైన విమానంలో వస్తూ ఉంటారు. అలాంటిది సొంత చిన్నాన్న చనిపోతే పులివెందులకు మరుసటి రోజు వచ్చారు.. తన తండ్రి చనిపోయిన నేపథ్యంలో నిందితులను పట్టుకోవాలని ఆరోజు జగన్మోహన్ రెడ్డిని అడిగితే…కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తానని నాడు సునీతా రెడ్డికి జగన్ హామీ ఇచ్చాడు. నిండు శాసనసభలో ఈ కన్ను నాదే, ఆ కన్నూ నాదే అని థియరీ చెప్పి కేసును కోల్డ్ స్టోరేజ్ లో పడేశాడు. తర్వాత సునీతా రెడ్డి సీబీఐ ని ఆశ్రయించడంతో దర్యాప్తు మొదలైంది.” అని బీటెక్ రవి ఆర్కే అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పాడు.

    ” ఆరోజు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు కుట్లు వేసింది తానే అని ఒప్పుకున్న అవినాష్ రెడ్డి తర్వాత సాక్షులను భయపెట్టాడు..దీనిపై ఏ ఒక్కనాడు కూడా అవినాష్ రెడ్డి స్పష్టమైన సమాధానం చెప్పలేదు. తన రాజకీయ స్వలాభం కోసం తండ్రి భాస్కర్ రెడ్డిని జైలుకు పంపించాడు. ఒకవేళ తన దాకా వస్తే అవినాష్ రెడ్డిని కచ్చితంగా జగన్ జైలుకు పంపిస్తాడు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు.. తెరపైన ఇన్ని నిజాలు కనిపిస్తున్నప్పుడు అన్ని కళ్ళూ తాడేపల్లి ప్యాలెస్ వైపు ఎందుకు చూపించవు” అని రవి ప్రశ్నించారు.

    ” వాస్తవానికి రాజారెడ్డి కంటే రాజశేఖర్ రెడ్డి చాలా డేంజర్.. తన కొడుకు భవిష్యత్తు కోసం చాలా తప్పులు తన మీద వేసుకున్నాడు.. త్యాగమూర్తిగా నిలిచిపోయాడు.. రాజశేఖర్ రెడ్డి కంటే జగన్ చాలా చాలా డేంజర్. జగన్ కు తెలియకుండా పులివెందులలో ఒక్క మర్డర్ కూడా జరగదు. పైగా జగన్ ఇంట్లో “భారతి” రాజ్యాంగం అమలవుతుంది. జగన్ కంటే ఆమెకి నాలెడ్జ్ ఎక్కువ.. పైగా వివేకనందా రెడ్డి కేసును సైడ్ ట్రాక్ పట్టించేందుకు అతడిని స్త్రీ లోలుడిని చేశారు. సునీతా రెడ్డి చంపిందని అబాంఢాలు వేశారు. ఇది వారు నమ్మే జీసస్ కూడా క్షమించడు. నాడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ వివేకానంద రెడ్డి హత్య కేసును నామీద తోసేయాలని ప్రయత్నం చేశారు.. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.. బ్లడ్ చూస్తే చాలు దాని గ్రూప్ ఏంటో చెప్పగల సొంతం భారతి జగన్మోహన్ రెడ్డి కి ఉంది.. అలాంటివారు దేనికైనా తెగిస్తారు” అని బీటెక్ రవి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కుండ బద్దలు కొట్టాడు.. ప్రోమోనే ఇలా ఉంటే.. పూర్తి ఎపిసోడ్ ఎలా ఉంటుందో.. మొత్తానికైతే వివేకనందారెడ్డి హత్య కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. ఆ జిల్లాకి చెందిన టిడిపి మాజీ ఎమ్మెల్సీ ని రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.