TDP Leaders: 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి ఏపీలో జోరుగా వీయడంతో టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. 175 అసెంబ్లీ సీట్లకుగాను కేవలం 23 స్థానాలతో టీడీపీ సరిపెట్టుకుంది. బంపర్ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతలపై ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను వెలికిస్తూ ఒక్కో నేతను జైళ్లకు పంపుతున్నారు.
గడిచిన రెండున్నేళ్లలో టీడీపీకి చెందిన ఎంతోమంది నేతలు ఇతర పార్టీలకు వలసలు వెళ్లారు. కొందరు భయంతో, మరికొందరు ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లారు. బీజేపీలో ఉంటూ టీడీపీకి కోవర్టులుగా పని చేసిన వారున్నాయి. ముఖ్యంగా రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు బీజేపీలో చేరి కషాయ కండువా కప్పుకున్నారు.
అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు చేపట్టాక టీడీపీ కోవర్టులందరినీ ఏరిపారిస్తున్నారు. ఆయన బీజేపీ నేతలకే ప్రాధాన్యం ఇస్తూ టీడీపీ నేతలను పక్కన పెడుతున్నారు. దీంతో వారికి ఆపార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయింది. మరోవైపు ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఈనేపథ్యంలోనే బీజేపీలో చేరిన టీడీపీ నేతలు సొంతగూటికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈక్రమంలోలనే పలువురు టీడీపీ నేతలు కష్టకాలంలో పార్టీకి సేవలందించిన వారికి టికెట్లు కేటాయించాలని పార్టీని వదిలిన వెళ్లిన వారిని పట్టించుకోవద్దని చంద్రబాబుకు సూచిస్తున్నారు. గతంలో జరిగిన అనుభవాలను ఆయనకు గుర్తు చేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి గతంలో బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కొందరు టీడీపీ నేతలు ఆయన్ని తీసుకోవాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తుండగా ఆయన ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. టీడీపీ నుంచి సూరి బీజేపీలోకి వెళ్లాక అక్కడ ఇన్ ఛార్జిగా పరిటాల శ్రీరాంను చంద్రబాబు నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి శ్రీరాం పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో సూరి పార్టీలోకి వచ్చి కష్టపడి పని చేస్తేనే పదవుల గురించి ఆలోచిస్తామని శ్రీరాం అంటున్నాడు.
Also Read: ఈసారి టికెట్ల కేటాయింపు చంద్రబాబు చేతుల్లో లేదట?
తనను కాదని చంద్రబాబు సూరిని పార్టీలోకి ఆహ్వానిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని శ్రీరాం అంటున్నాడు. అయితే ఈ విషయంలో చంద్రబాబు సైలంట్ గా ఉన్నారు. సూరి వర్గీయులు మాత్రం సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరుతామని బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు. తనక్కొడినే కాదని బీజేపీలో చేరిన చాలామంది టీడీపీ నేతలు సొంతగూటికి వస్తున్నారంటూ ప్రకటనలు చేస్తున్నారు.
టీడీపీలోకి ఇప్పుడు రాకుంటే తమ సీటుకు దక్కదనే ఆలోచనతో వారంతా ఎన్నికలకు ముందుగానే ఆపార్టీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి రావుల కిషోర్ సైతం టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ అధినేత చంద్రబాబు చేరికలను గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
Also Read: నాకు ఎవరి క్షమాపణలు అవసరంలేదు.. నారా భువనేశ్వరి ఫైర్!