Homeఆంధ్రప్రదేశ్‌Venkataramana: జనసేన ఎఫెక్ట్.. టీడీపీ నేతను లక్కొనే పనిలో వైసీపీ

Venkataramana: జనసేన ఎఫెక్ట్.. టీడీపీ నేతను లక్కొనే పనిలో వైసీపీ

Venkataramana
Venkataramana

Venkataramana: ఏపీలో జంపింగ్ జపాంగులు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు సమీపించే కొలదీ ఇవి మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా అవకాశాలు రావనుకున్న వారు పార్టీలు వీడుతున్నారు. అయితే ఇందులో పార్టీకి, అధినేతకు వీర విధేయులు, భక్తులు కూడా పార్టీ మారుతుండడం విశేషం. రాజకీయాల్లో అవసరాలే తప్ప.. విధేయతకు తావులేదని చాటిచెబుతున్నారు. నెల్లూరులో టీడీపీ అధికార వైసీపీకి గట్టి దెబ్బ కొట్టింది. సీనియర్ల తెర వెనుక ఉండి రాజకీయాలను నడిపిస్తోంది. అక్కడ ధిక్కార స్వరాలకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తోంది. దానికి రివేంజ్ తీసుకునే పనిలో ఉంది అధికార వైసీపీకి. టీడీపీకి పట్టున్న కృష్ణా జిల్లాలో గట్టి దెబ్బతీసే పనిలో ఉంది. జనసేనను సాకుగా చూపి ఓ మాజీ ఎమ్మెల్యేను టీడీపీ నుంచి లాక్కునే ప్రయత్నంలో ఉంది.

Also Read: KCR Assembly: కాంగ్రెస్‌కు కేసీఆర్‌ స్నేహ హస్తం.. అసెంబ్లీ ప్రసంగంలో వెనుక పెద్ద కథ!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి పట్టు ఎక్కువ. ఆవిర్భావం నుంచి మంచి ఫలితాలే సాధిస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో మాత్రం ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక్క గన్నవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాలు మినహాయించి మిగతా నియోజకవర్గాల్లో వైసీపీ పాగా వేసింది. కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనసేనతో పొత్తు ఆ పార్టీకి లాభిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే జనసేనతో పొత్తులను సాకుగా చూపించి టీడీపీ సీనియర్లలో వైసీపీ అభద్రతా భావం సృష్టిస్తోంది. వారిని వైసీపీ కండువా కప్పుకునేలా ఒత్తిడి చేస్తోంది. ముఖ్యంగా టీడీపీలో సీనియర్, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను వైసీపీలోకి రప్పించేందుకు పెద్ద స్కెచ్చే వేసింది.

కైకలూరు నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంది. ఏలూరు పార్లమెంట్ స్థానంలో కొనసాగుతోంది. అక్కడ టీడీపీ ఇన్ చార్జి ఎవరూ లేరు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన జయమంగళం వెంకటరమణ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో మాత్రం పొత్తులో భాగంగా బీజేపీకి ఆ స్థానం అప్పగించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కామినేని శ్రీనివాస్ గెలుపొందారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో బీజేపీ నేతలతో పాటు పవన్ తో సమావేశాలు, చర్చల్లో కామినేని కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ కటీఫ్ చెప్పడంతో కామినేని సైలెంట్ అయ్యారు. టీడీపీ మళ్లీ జయమంగళం వెంకటరమణకే సీటు ఇచ్చింది. కానీ ఆయన వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓటమి చవిచూశారు. అయితే జయమంగళం వెంకటరమణకు అధికారికంగా టీడీపీ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించడంలో హైకమాండ్ జాప్యం చేస్తూ వస్తోంది.

Venkataramana
Venkataramana

అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన తనకు హైకమాండ్ అన్యాయం చేస్తోందన్న బాధ జయమంగళంలో ఉంది. అయితే టీడీపీ వ్యూహాత్మకంగానే ఇక్కడ ఇన్ చార్జి పోస్టును ఖాళీగా పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. పొత్తు కుదిరితే కైకలూరు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలను జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అందుకు అనుగుణంగా ఇక్కడ పార్టీ బాధ్యతలను ఎవరికీ ఇవ్వకుండా చంద్రబాబు రిజర్వ్ లో పెట్టారు. కైకలూరు విషయంలో హైకమాండ్ వేచిచూసే ధోరణిలో ఉండడంతో జయమంగళం వెంకటరమణలో అసహనం పెరుగుతోంది.దానికితోడు వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. జయమంగళంను వైసీపీలోకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికైతే జనసేన ఎఫెక్ట్ తో టీడీపీ నేత వైసీపీలోకి వెళ్లడం ఖాయమని తేలుతోంది.

Also Read:I-PAC Team Survey Report: ఐప్యాక్ చిట్టా లీక్.. జగన్ లిస్టులో టికెట్లు దక్కేది ఎవరికంటే?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version