Cine Hero`s vs YCP: ఏపీకి సినీనటులు అందుకే వరదసాయం చేయలేదా? వైసీపీ అటాక్ న్యాయమేనా?

Cine Hero`s vs YCP: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ దాదాపుగా వరదలో మునిగింది. వరద ధాటికి మనుషులు కొట్టుకుపోగా.. ఇళ్లు, పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బంధువులు, కట్టుకున్న ఇళ్లు కళ్లముందే కొట్టుకోపోవడంతో కట్టుబట్టలతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. అయితే వరదసాయంలో ప్రభుత్వం అప్రమత్తం కావడంలో ఆలస్యమైందని, ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే ప్రాణ నష్టం తగ్గేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సీఎం జగన్ కేవలం గాలిలో విహరిస్తూ వెళ్లారని, […]

Written By: NARESH, Updated On : November 28, 2021 10:19 am
Follow us on

Cine Hero`s vs YCP: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ దాదాపుగా వరదలో మునిగింది. వరద ధాటికి మనుషులు కొట్టుకుపోగా.. ఇళ్లు, పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బంధువులు, కట్టుకున్న ఇళ్లు కళ్లముందే కొట్టుకోపోవడంతో కట్టుబట్టలతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. అయితే వరదసాయంలో ప్రభుత్వం అప్రమత్తం కావడంలో ఆలస్యమైందని, ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే ప్రాణ నష్టం తగ్గేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సీఎం జగన్ కేవలం గాలిలో విహరిస్తూ వెళ్లారని, ప్రత్యక్షంగా బాధితులను కలుసుకోలేదని అంటున్నారు. ఈ తరుణంలో నెల్లూరుకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ రంగానికి చెందిన వారు ముందుకు రావాలని అంటున్నారు. అంతేకాకుండా వారికి బుద్దిలేదా..? అంటూ హాట్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

Chiranjeevi-Nagarjuna-SS-Rajamouli-Dil-Raju-Y.S.-Jagan-Mohan-Reddy

తెలుగు ప్రేక్షకుల వల్ల సినిమా హీరోలు ఎంతో ఎత్తుకు ఎదిగారని, వారి దయవల్లే సినిమా వాళ్లు కోట్లు సంపాదించారని నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా వరదలతో నష్టపోయిన వారికి విరాళాలు అందించాలని, వారికి సాయం చేయాలని నటులకు బద్ది ఉండక్కర్లా..? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను కొందరు వైసీపీ నేతలు సమర్థించారు . అంతేకాకుండా వారు కూడా పరోక్షంగా విమర్శలు చేశారు.

నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనాతో కుదేలైన సినీ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని ఎప్పటి నుంచో కోరుతోంది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు లాంటి సినీ పెద్దలు పేర్ని నానితో సమావేశమయ్యారు. ఇటీవల చిరంజీవి మరోసారి కలిసి సినీ పరిశ్రమకు చెందిన టిక్కెట్ల విషయంలో మరోసారి ఆలోచించాలని కోరారు. టిక్కెట్ల విషయంలో అయోమయం నెలకొనడంతో పెద్ద పెద్ద సినిమాలు ఆగిపోయాయని, సినీ పరిశ్రమను ఆదుకునేలా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

అయితే ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు పెంచొద్దని నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొంతమంది నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమయంలో కొవ్వూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సినీ రంగానికి చెందిన వారు కౌంటర్ ఇస్తున్నారు. తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న సినీ పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోపోగా.. ఇప్పుడు వరద బాధితుల విషయంలో విరాళాలు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు అనడం సమంజసం కాదని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయాలతో రాష్ట్రంలో చాలా థియేటర్లు మూత పడ్డాయి. కొందరు సినిమాలు తీసినా అక్కడ రిలీజ్ చేయడం మానేశారు. పెద్ద పెద్ద సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. దీనంతటికి కారణం వైసీపీ సర్కారు కదా..? అని ప్రశ్నిస్తున్నారు.

రాయలసీమలో జరిగిన వరదలు మాములివికావు. 50ఏళ్లలో జరిగిన పెద్ద విపత్తు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అప్రమత్తమై ముందుండి సాయం అందించాల్సిన అవసరం ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారిని విరాళాలు అడిగితే వారు ఇచ్చేవారు కావచ్చు. కానీ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన వారిని విరాళాలు ఇవ్వాలని, అదీ డిమాండ్ చేయడం ఎలా అని కొందరు వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.

సినీ నటులకు బుద్ది లేదా..? అంటున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరద బాధితులను ముందర వేసుకొని రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు మీద, మీడియా మీద ఇప్పటికే పరుష వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా సినీ నటుల మీద చేసిన కామెంట్లపై ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.